INDvEng: కోహ్లీ X జోరూట్ ఫస్ట్ బిగ్‌ఫైట్ ఎల్లుండే.. మ్యాచ్ టైమింగ్స్,ఫుల్ షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు!

Ind vs Eng 2021 Full Schedule, Venue, Squad Details || Oneindia Telugu

హైదరాబాద్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫస్ట్ ఎడిషన్ ఫైనల్ అనంతరం వచ్చిన లాంగ్ బ్రేక్ తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు మరో ఆసక్తికర సిరీస్‌కు సిద్దమైంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఆగస్టు 4(బుధవారం) నుంచి ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్‌కు ఈ సిరీస్‌తోనే తెరలేవనుంది.

దాంతో ఇరు జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అంతేకాకుండా సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించేందుకు కోహ్లీసేన తహతహలాడుతోంది. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో భారత్ వేదికగా ఎదురైన వరుస పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని జోరూట్ సేన భావిస్తోంది. దాంతో అభిమానులకు అసలు సిసలు మజా లభించనుంది. ఇక ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్‌తో పాటు మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకుందాం.

బ్యాటింగ్ ప్యాడ్స్‌ను ఇలాక్కూడా వాడేస్తారేంటీ?: బుమ్రా ఇంకో 17 వికెట్లు తీస్తే..కొత్త రికార్డ్బ్యాటింగ్ ప్యాడ్స్‌ను ఇలాక్కూడా వాడేస్తారేంటీ?: బుమ్రా ఇంకో 17 వికెట్లు తీస్తే..కొత్త రికార్డ్

 ఫుల్ షెడ్యూల్..

ఫుల్ షెడ్యూల్..

మ్యాచ్ తేదీ వేదిక
భారత్ X ఇంగ్లండ్ ఫస్ట్ టెస్ట్ ఆగస్టు 4-8 నాటింగ్‌హోమ్
భారత్ X ఇంగ్లండ్ సెకండ్ టెస్ట్ ఆగస్టు 12-16 లండన్(లార్డ్స్)
భారత్ X ఇంగ్లండ్ మూడో టెస్ట్ ఆగస్టు 25-29 లీడ్స్
భారత్ X ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ సెప్టెంబర్ 2-6 లండన్(లార్డ్స్)
భారత్ X ఇంగ్లండ్ ఐదో టెస్ట్ ఆగస్టు 10-14 మాంచెస్టర్
మ్యాచ్ టైమింగ్స్

మ్యాచ్ టైమింగ్స్

భారత్ X ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ లెక్కన రాత్రి 10.30 నుంచి 11.00 గంటల వరకు ఆట కొనసాగవచ్చు. ప్రస్తుతానికి సిరీస్‌లోని ఐదు టెస్ట్‌ల టైమింగ్స్ ఇవే. ఏవైనా అంతరాయలు కలిగితే ఈ టైమింగ్స్‌లో మార్పు ఉండవచ్చు.

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..

భారత్ X ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సంబంధించిన లైవ్ భారత్‌లో సోనీ టెన్ చానెల్‌లో వస్తుంది. సోటీ టెన్1, 2, 3, 4 చానళ్లతో పాటు రీజియన్ లాంగ్వేజ్ చానల్స్‌లో కూడా రానుంది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సోనీ లివ్‌లో కూడా మ్యాచ్‌లను చూడవచ్చు. జియో టీవీ యాప్ ద్వారా కూడా ఈ సిరీస్‌ను ఉచితంగా, ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా చూడవచ్చు.

ఇరు జట్ల వివరాలు..

ఇరు జట్ల వివరాలు..

భారత జట్టు: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే(వైస్‌ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్దిమాన్ సాహా(కీపర్), అభిమాన్యు ఈశ్వరన్, సూర్యకుమార్ యాదవ్*, పృథ్వీ షా*

ఇంగ్లండ్ టీమ్: జోరూట్ (కెప్టెన్), రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లే, జోస్ బట్లర్, మార్క్ వుడ్, సామ్ కరన్, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, డొమినిక్ బాస్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ క్రాలీ, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, క్రైగ్ ఓవర్టన్

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, August 2, 2021, 14:11 [IST]
Other articles published on Aug 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X