Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్‌తో నేడే తొలి టీ20.. వైభవ్ అరంగేట్రంపై కెప్టెన్ బిగ్ ట్విస్ట్!

IND vs ENG: క్రికెట్ ప్రపంచంలో సరికొత్త సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్నఇప్పుడు ప్రతి చోటా వినిపిస్తోంది. ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్ తో సృష్టించిన విధ్వంసం చూసిన తర్వాత.. మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్లు కూడా వైభవ్ సూర్యవంశీని మైదానంలో చూడాలని ఆరాటపడుతున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఈ రోజు రాత్రి 10 గంటలకు ఇంగ్లాండ్‌తో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి పోరులో వైభవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే జట్టు యాజమాన్యం మాత్రం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై స్పష్టత ఇవ్వకుండా దాటవేస్తోంది. మ్యాచ్ కు ఒక రోజు ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన సమాధానం కూడా అభిమానులను కాస్త నిరాశకు గురిచేసేలా ఉంది.

మరికొద్ది గంటల్లోనే తేలనున్న వైభవ్ భవితవ్యం
ఐర్లాండ్ జట్టుతో జరిగిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసిన తర్వాత ఇప్పుడు టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై తలపడనుంది. గతంలో ఐర్లాండ్ జట్టుపై ఎదురైన ఓ పరాజయం తర్వాత వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ సోషల్ మీడియాలో మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే టీమ్ కాంబినేషన్‌పై చర్చలు జరిపి.. నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగి 11 మంది ఆటగాళ్లను ఖరారు చేసి ఉంటారు. అయితే మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ప్రత్యర్థి జట్టుకు తమ వ్యూహాలను ముందే వెల్లడించలేమని స్పష్టం చేశారు. బహుశా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగిస్తూ ఇంగ్లాండ్ జట్టుతో మైండ్ గేమ్ ఆడుతున్నారేమో.. నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో వైభవ్ సూర్యవంశీని దించి ఇంగ్లాండ్ జట్టుకు షాకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

IND vs ENG 1st T20I Will 15-Year-Old Vaibhav Sooryavanshi Debut Tonight Shreyas Iyer Reacts

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే?
బుధవారం డర్హామ్‌లో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడా లేదా అనే విషయాన్ని శ్రేయస్ అయ్యర్ సూటిగా చెప్పలేదు. ఈ 15 ఏళ్ల కుర్రాడిపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ.. "ఎప్పుడు అవకాశం వచ్చినా వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా రాణిస్తాడు. కానీ ప్రస్తుతావికి మా చేతులు కట్టేసి ఉన్నాయి. మేము ఏం చేయబోతున్నామనేది జట్టు అంతర్గత విషయం. మా కాంబినేషన్ ను ప్రత్యర్థి జట్టుకు చెప్పలేం" అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. అంతే కాకుండా జట్టులోని ప్రతి ఆటగాడు బాగా రాణించాడని, టీ20 ప్రపంచ కప్ గెలవడంలో సహాయపడిన ఆటగాళ్లను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఏదేమైనా మరికొద్ది గంటల్లో మ్యాచ్ ప్రారంభమైతేనే వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ జట్టుపై బరిలోకి దిగుతాడా లేదా అనేది పూర్తిగా తేలిపోనుంది.

భారత జట్టు అంచనా(ప్లేయింగ్-11): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

Story first published: Wednesday, July 1, 2026, 10:35 [IST]
Other articles published on Jul 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+