Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం?

IND vs ENG: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో వరుసగా మూడు అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో టీమిండియాకు బిగ్గెస్ట్ హీరోగా నిలిచిన సంజూ శాంసన్.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి అభిమానుల గుండె పగిలేలా చేస్తున్నాడు. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఐర్లాండ్ పర్యటనలో ఆడిన 2 మ్యాచ్‌లలోనూ సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. సంజూ శాంసన్ వైఫల్యం కారణంగా టీమిండియా ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ రెండు పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ జట్టు యాజమాన్యం సంజూ శాంసన్‌పై నమ్మకం ఉంచి ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లోనూ తుది జట్టులో అవకాశం కల్పించింది. కానీ సంజూ శాంసన్ మాత్రం తన వరుస వైఫల్యాల పరంపరను ఇక్కడా కొనసాగిస్తూ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.

గత మూడు ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే సంజూ శాంసన్ పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 లో 4 బంతుల్లో 5 రన్స్ మాత్రమే చేసి ఔటైన సంజూ శాంసన్యయ రెండో టీ20 లో కనీసం ఖాతా తెరవకుండానే ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. ఇక ఇంగ్లాండ్‌ జట్టుపై జరిగే ఈ మొదటి మ్యాచ్‌లోనైనా అతను కమ్‌బ్యాక్ ఇస్తాడని అందరూ ఆశించారు. కానీ ఇక్కడ కూడా 7 బంతులు ఆడి కేవలం 1 రన్ మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. దాంతో పవర్‌ప్లేలోనే టీమిండియాపై ఒత్తిడి పెరిగిపోయింది. సంజూ శాంసన్ విఫలమైన తరుణంలో సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

IND vs ENG 1st T20I Sanju Samson flops again Will Vaibhav Sooryavanshi debut in 2nd T20I Details

వైఫల్యాల వేళ చెలరేగిన అభిషేక్ శర్మ
ఇదే మ్యాచ్‌లో మరో కీలక ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా పరుగులేమీ చేయకుండా దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడిన అభిషేక్ శర్మ, కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సహాయంతో 59 పరుగులు సాధించి జట్టుకు మంచి పునాది వేశాడు.

అభీషేక్ శర్మ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు సాధించగలిగింది. ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పరిస్థితికి తగ్గట్టుగా నిలకడగా రాణించి 47 బంతుల్లో 68 పరుగులు చేశాడు. చివరలో శివమ్ దూబే(42*) మెరుపులు మెరిపించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేయగలిగింది.

రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కేనా?
వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా నిరాశపరిచిన సంజూ శాంసన్‌కు తదుపరి జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో అవకాశం కల్పిస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ శాంసన్‌ను మరోసారి నమ్ముతారా లేక పక్కన పెడతారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ సంజూ శాంసన్‌కు విశ్రాంతినిస్తే.. అతని స్థానంలో కేవలం 15 ఏళ్ల వయసున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకుని అరంగేట్రం చేయించే ఆలోచన కూడా ఉంది.

ఐర్లాండ్ సిరీస్‌లోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందని అందరూ ఆశించినప్పటికీ.. అతనికి తగిన ఛాన్స్ రాలేదు. ప్రస్తుతం భారత ఓపెనర్లు తీవ్ర ఒత్తిడిలో ఉండటం వల్ల, జట్టు యాజమాన్యం తదుపరి మ్యాచ్‌లో మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలో జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌లో సంజూ లక్ నిలుస్తుందో లేక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు దక్కుతుందో చూడాలి.

Story first published: Thursday, July 2, 2026, 0:11 [IST]
Other articles published on Jul 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+