For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs Eng 1st T20: భారత్-ఇంగ్లాండ్ తొలి టీ20.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

IND vs Eng T20i: టీమిండియా ( India ) మరో సిరీస్ కోసం సిద్ధం అవుతోంది. భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య T20లు జరుగనున్నాయి. భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జనవరి 22న T20I సిరీస్‌ ప్రారంభం కానుంది. T20I సిరీస్‌ లో ఇంగ్లాండ్ ను ( England ) ఓడించేందుకు సిద్ధం అవుతోంది టీమిండియా.

టీమిండియా - ఇంగ్లాండ్ టీ20 సిరీస్ పోరుకు రంగం సిద్ధమైంది. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కన్నా ముందు ఇరు జట్లు ఐదు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డేలలో తలపడనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 22న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

IND vs ENG 1st T20I Live Streaming details Where To Watch Teamindia england t20 series

2023 ODI ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన సీనియర్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఈ మ్యాచ్ తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడి అనుభవం ఈ మ్యాచ్ లో కీలకం కానుంది. ఇక ఇంగ్లాండ్ జట్టును జాస్ బట్లర్ నడిపిస్తున్నాడు. అతడు కూడా మ్యాచ్ ను విజయంతో ప్రారంభించి, భారత్ పై ఒత్తిడి పెంచాలని పట్టుదలతో ఉన్నాడు.

తొలి మ్యాచ్ కు కోల్ కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ వేదికపై టీ20 మ్యాచ్ జరగనుంది. చివరిగా ఈ వేదికపై భారత్ - వెస్టిండీస్ 2022లో ఫిబ్రవరి 20న తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచింది.

చివరగా T20 ప్రపంచ కప్ 2024 సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించింది రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా. ఆ తర్వాత ఫైనల్ లో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అంతకుముందు 2022 ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో భారత్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించి.. ఫైనల్ లో వరల్డ్ కప్ ను దక్కించుకుంది ఇంగ్లాండ్.

మ్యాచ్ లు ఎలా చూడాలంటే?
తొలి టీ20 - జనవరి 22 - ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
భారత కాలమాన ప్రకారం మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది.
UK కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.
స్టార్ స్పోర్ట్స్ నెటవర్క్ ప్రసార హక్కులను దక్కించుకుంది. తొలి మ్యాచ్ ఈ ఛానల్ లోనే ప్రసారం కానుంది.
ఆన్ లైన్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే డిస్నీ హాట్ స్టార్ యాప్ లేదా వెబ్ సైట్ లో వీక్షించొచ్చు.

టీ20 సిరీస్ పూర్తి షెడ్యూల్
తొలి టీ20: బుధవారం, జనవరి 22, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
రెండో టీ20: శనివారం, జనవరి 25.. MA చిదంబరం స్టేడియం, చెన్నై
మూడో టీ20: మంగళవారం, జనవరి 28, నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్
నాలుగో టీ20: శుక్రవారం, జనవరి 31, MCA స్టేడియం, పుణె
ఐదో టీ20: ఆదివారం, ఫిబ్రవరి 2, వాంఖడే స్టేడియం, ముంబయి

టీ20 సిరీస్ జట్లు ఇవే

టీమిండియా : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్, అక్షర్ పటేల్ , అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ధ్రువ్ జురెల్.

ఇంగ్లాండ్ : జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, రెహాన్ అహ్మద్, జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే, హ్యారీ బ్రూక్, జామీ ఓవర్టన్, బెన్ డకెట్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, ఫిల్ సాల్ట్,

Story first published: Tuesday, January 21, 2025, 11:06 [IST]
Other articles published on Jan 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+