ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడేందుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా రెడీగా ఉంది. అయితే ఈ సిరీస్ కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఒకవేళ ఆ రికార్డును అతడు సాధిస్తే.. కెప్టెన్ రోహిత్ తో పాటు పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం రికార్డ్ ను బ్రేక్ చేసినట్టవుతుంది.
ఆ రికార్డు ఏంటంటే
ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జనవరి 22న జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ కోల్‌కతాకు చేరుకున్నారు. అక్కడ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అయితే తొలి మ్యాచ్ లో సూర్య కుమార్ సెంచరీ బాదితే... టీ20ల్లో ఇంగ్లాండ్ జట్టుపై రెండు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు. ఇంగ్లాండ్ పై సూర్య ఇప్పటికే ఓ టీ20 శతకాన్ని బాదాడు. సూర్యతో పాటు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజం కూడా ఇంగ్లాండ్ పై తలా ఓ టీ20 శతకాన్ని నమోదు చేశారు.
ఇప్పుడు కోల్‌కతాలో జరగబోయే తొలి టీ20లో మిస్టర్ 360 శతకం బాదితే.. రోహిత్ బాబర్ రికార్డ్ ను అధిగమించినట్టవుతుంది. ఒకవేళ మొదటి టీ20లో బాదకపోయినా, సిరీస్ లోని మిగితా మ్యాచుల్లో బాదిన ఈ రికార్డులు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
అలానే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక శతకాలు చేసిన ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్, రోహిత్ శర్మ రికార్డును కూడా సమం చేసినట్టవుతుంది. మాక్సీ, రోహిత్ ఇప్పటివరకు 5 టీ20 శతకాలను బాదారు. సూర్యకుమార్ ఇప్పటివరకు 4 అంతర్జాతీయ టీ20 శతకాలను నమోదు చేశాడు.
కాగా, సూర్యకుమార్ యాదవ్ టీ20 స్పెషలిస్ట్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 78 టీ20 మ్యాచ్‌లు ఆడి 40.8 సగటుతో 2570 పరుగులు సాధించాడు. 4 టీ20 సెంచరీలు బాదాడు.