Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'బానే పాడావ్.. ముందు ఆటపై ఫోకస్ చేయ్' - సంజూ శాంసన్ పై సూర్యకుమార్ సెటైర్!

ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో మరోసారి సంజూ శాంసన్ గురించి తీవ్ర చర్చ సాగుతోన్న సంగతి తెలిసిందే. అందుకు కారణం అతడిని ఇంగ్లాండ్ వన్డే సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడమే. అయితే సంజూ మాత్రం ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాడో లేదో తెలీదు కానీ.. ప్రస్తుత సమయాన్ని ఎంచక్కా హ్యాపీగా గడుపుతున్నాడు.

ఈ క్రమంలోనే సంజూ శాంసన్ ఓ సూపర్ హిట్ బాలీవుడ్ సాంగ్ ను కూడా పాడి ఫ్యాన్స్ తో పాటు తన తోటి క్రికెటర్లను అలరించాడు. తాను పాడిన పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అభిషేక్ నాయర్ తో కలిసి 'జీతా వోహి సికందర్' సాంగ్ ను పాడి దానికి ఫీడ్ బ్యాక్ ఇవ్వండి అంటూ కోరాడు. "సాధ్యం కానిది అంటూ ఏమీ లేదు. నేను పాట పాడు. నేను ముంబయికి వచ్చేయనా?(బాలీవుడ్)" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.

IND VS ENG 1st T20 Surya kumary yadav asks Sanju Samson to focus on matches while sanju singing Bollywood song

అయితే దీనికి సూర్య కుమార్ యాదవ్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. "న్వువ్వు ముంబయి వస్తావు. కానీ అంతకన్నా ముందు చెన్నై, రాజ్ కోట్ , పుణెకు వచ్చాకే రావాలి." అని బదులిచ్చాడు.

కాగా, జనవరి 22 నుంచి టీమిండియా.. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు సంజూ శాంసన్ వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ కోల్ కతా వేదికగా జరగనుంది. ఆ తర్వాత చెన్నై, రాజ్ కోట్, పుణె వేదికగా మిగతా మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ వేదికలను ఉద్దేశించే సూర్య కుమార్ యాదవ్ రిప్లై ఇచ్చాడు. ముందు మ్యాచ్ లపై ఫోకస్ పెట్టు అన్నట్టుగా సూచించాడు. ఇకపోతే ఇప్పటికే తొలి మ్యాచ్ కోసం టీమిండియా కోల్ కతాకు చేరుకుంది. ప్రాక్టీస్ సెషన్ కూడా ప్రారంభించింది. అక్కడే తన జట్టు సభ్యులతో ఉన్న సంజూ శాంసన్ పాటను పాడాడు.

Story first published: Tuesday, January 21, 2025, 16:08 [IST]
Other articles published on Jan 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+