For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND VS ENG 1st T20 : అభిషేక్ శర్మ వీరబాదుడు.. ఈ బ్యూటీఫుల్ లేడీనే కారణం!

అభిషేశ్ శర్మ.. ప్రస్తుతం ఈ పేరు మరోసారి మార్మోగిపోతోంది. అందుకు కారణం.. ఇంగ్లాండ్ తో తాజాగా జరిగిన తొలి టీ20లో బ్యాట్ తో అతడు ఊచకోత కోయడమే. 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 79 పరుగులు చేశాడు. పలు భారీ రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. అయితే అతడి సక్సెస్ ఫుల్ క్రికెట్ కెరీర్ వెనక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. తండ్రి మాజీ క్రికెటర్. తల్లి మంజు, సోదరి కోమల్ శర్మ.. అభిషేక్ కెరీర్ ను తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా అతడి సోదరి కోమల్ శర్మ పాత్ర అయితే ఎంతో దాగి ఉంది.

అభిషేక్ శర్మ ఆడే మ్యాచులకు అప్పుడప్పుడు హాజరయ్యే కోమల్ శర్మ చాలా సార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ గా మారింది. గతేడాది ఐపీఎల్ సీజన్ లోనూ అభిషేక్ శర్మ ఆడే మ్యాచ్ లకు అతడి తల్లి, సోదరి కోమల్ హాజరై ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా కోమల్ అభిషేక్ కు సపోర్ట్ ఇచ్చే విషయంతో పాటు తన చార్మింగ్ ప్రెజెన్స్ తో నేషనల్ వైడ్ గా ఎంతో మంది క్రికెట్ అభిమానుల మనసు దోచింది. అయితే ఆమె మళ్లీ.. అభిషేక్ శర్మ తాజా ప్రదర్శనతో వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు, వివరాలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ - కోమల్ మధ్య ఉన్న బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

IND VS ENG 1st T20 Meet Komal Sharma sister of Abhishek Sharma the standout performer against england match

కోమల్.. అభిషేక్ శర్మ కన్నా పెద్దది. మార్చి 20, 1994లో కోమల్‌ శర్మ జన్మించింది. ఆమె ఫిజియోథెరపీ డాక్టర్ కూడా. అందుకే అభిషేక్ శర్మ ఫిట్ నెస్ విషయంలోనూ ఆమె పూర్తి శ్రద్ధ తీసుకుంటుంది. అతడు ఆరోగ్యంగా, బలంగా ఉండే విషయంలో ఈమె పాత్ర ఎంతో కీలకం. అభిషేక్ కు మోటివేటర్ గా ఉంటూ అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంటుంది. అతడు నిలకడగా క్రికెట్ ఆడేలా ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తుంటుంది.

IND VS ENG 1st T20 Meet Komal Sharma sister of Abhishek Sharma the standout performer against england match

సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్
తన సోదరుడు అభిషేక్ ఇన్ స్పైర్ చేయడంతో పాటు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది కోమల్. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని గురునానక్‌ దేవ్‌ యూనివర్సిటీలో ఫిజియోథెరపీలో బ్యాచిలర్‌ డిగ్రీ చేసింది కోమల్. జైపుర్‌లోని నిమ్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం అమృత్‌సర్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా కొనసాగుతోంది. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇన్ స్టాలో ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.

Story first published: Thursday, January 23, 2025, 12:00 [IST]
Other articles published on Jan 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+