హార్దిక్ పాండ్యా హైలైట్..
ఈ మ్యాచ్ మొత్తాన్నీ హార్దిక్ పాండ్యా డామినేట్ చేశాడు. అతని బ్యాటింగ్, బౌలింగ్ హైలైట్స్‌గా నిలిచాయి. తొలుత బ్యాటింగ్‌లో, ఆ తరువాత బౌలింగ్‌లో చెలరేగాడు. ఈ సిరీస్‌తో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్ 2022, ఐర్లాండ్ పర్యటన దూకుడును కొనసాగించాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 51 పరుగులు సాధించాడు. బౌలర్‌గానూ తిరుగులేదనిపించుకున్నాడు. నాలుగు ఓవర్లల్లో 33 పరుగులు ఇచ్చా, నాలుగు వికెట్లు నేలకూల్చాడు.
హార్దిక్ పాండ్యాపై కేప్టెన్ ప్రశంసల వర్షం..
హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శనపై కేప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌లో మాట్లాడాడు రోహిత్. హార్దిక్ పాండ్యా మున్ముందు మరిన్ని అద్భుతాలు సాధిస్తాడని చెప్పాడు. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి ఇప్పటివరకు పాండ్యా.. తనను తాను మలచుకున్న తీరు ఓ అద్భుతమని వ్యాఖ్యానించాడు. అతని బౌలింగ్ తనను ఇంప్రెస్ చేసిందని పేర్కొన్నాడు. బౌలింగ్‌లో మరింత గొప్పగా రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. బంతులను సంధించడంలో వైవిధ్యాన్ని చూపాడని అన్నాడు.

బ్యాటింగ్ ఎంచుకోవడానికి కారణం..
టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడానికి కారణాన్ని వెల్లడించాడు రోహిత్ శర్మ. గాలిలో తేమశాతం అధికంగా ఉందని, దాన్ని వినియోగించుకోవాలని భావించినట్లు చెప్పాడు. పవర్ ప్లేలో ప్రత్యర్థిని నియంత్రించగలిగితే.. మ్యాచ్‌పై పట్టు సాధించినట్టవుతుందని, అదే సూత్రాన్ని అనుసరించామని వివరించాడు. ఫీల్డర్లు క్యాచ్‌లను జారవిడవటం పట్ల కొంత అసహనాన్ని వ్యక్తం చేశాడు. పీల్డింగ్ డిపార్ట్‌మెంట్‌లో హైస్టాండర్డ్స్ ఉండట్లేదని, దీనిపై దృష్టి సారిస్తామని పేర్కొన్నాడు.


క్రికెటింగ్ షాట్..
క్రీజ్‌లోకి దిగిన ప్రతి బ్యాటర్ సత్తా చాటడం వల్లే ప్రత్యర్థికి 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగామని రోహిత్ శర్మ చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో రూపొందించుకున్న ప్రణాళికల తగ్గట్టే బ్యాటర్లు రాణించారని అన్నాడు. పక్కా క్రికెటింగ్ షాట్లను ఆడారని పేర్కొన్నాడు. పిచ్ కూడా దీనికి సహకరించిందని వ్యాఖ్యానించాడు. తొలి ఆరు ఓవర్లల్లో వీలైనంత మేర భారీ స్కోర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి అనుగుణంగా ఆడగలిగామని పేర్కొన్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే పవర్ ప్లేలో తమ బ్యాటర్లు బౌలర్లపై అటాకింగ్ బ్యాటింగ్ చేశారని అన్నాడు.


Click it and Unblock the Notifications












