Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS ENG 1st T20 : చాహల్ కు ఎసరు పెట్టిన అర్షదీప్ సింగ్!

ఇంగ్లాండ్ తో తొలి టీ20 మ్యాచ్ కు ముందు టీమిండియా యంగ్ ఫాస్ట్‌ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ ను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది. అతడు టీ20ల్లో భారీ రికార్డుకు అతి చేరువలోకి వచ్చాడు. అంతర్జాతీయ టీ20ల్లో మరో రెండు వికెట్లు తీస్తే.. ఈ పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఇంగ్లాండ్‌తో జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌లో అర్ష్‌దీప్ ఈ రికార్డును చేరుకోవడం ఖాయం. కాగా, ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కు సెలెక్ట్ అయిన అర్ష్‌దీప్.. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ స్క్వాడ్ లోనూ స్థానం సంపాదించుకున్నాడు.

మరో ఐదు వికెట్లు తీస్తే
టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్‌కు మంచి రికార్డే ఉంది. గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకోవడంలో అర్ష్‌దీప్ కీలకంగా వ్యవహరించాడు. 8 మ్యాచుల్లో 17 వికెట్లు తీశాడు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 ల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అగ్ర స్థానంలో ఉన్నాడు. 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ సింగ్ 60 మ్యాచుల్లో 95 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.కాబట్టి ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్‌లో అర్షదీప్ సింగ్ ఐదు వికెట్లు తీయగలిగితే.. టీ20ల్లో 100 వికెట్లు ఖాతాలో వేసుకున్న తొలి భారత బౌలర్‌గానూ రికార్డు సృష్టిస్తాడు.

IND VS ENG 1st T20 Arshdeep Singh Targets Yuzvendra Chahal s All-Time T20 Record Ahead of INDIA vs ENGLAND First match

టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు ఎవరంటే

యుజ్వేంద్ర చాహల్ - (80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు)
అర్ష్‌దీప్ సింగ్ - (60 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు)
భువనేశ్వర్ కుమార్ - (87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు)
జస్‌ప్రీత్ బుమ్రా - (70 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు)
హార్దిక్ పాండ్య - (109 మ్యాచ్‌ల్ 89 వికెట్లులో)

Story first published: Tuesday, January 21, 2025, 17:20 [IST]
Other articles published on Jan 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+