
ఇంగ్లాండ్ వన్డే జట్టు ఇదే..
ఇండియాతో వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ టీం మేనేజ్ మెంట్ 15మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇక జట్టును ఓసారి పరిశీలిస్తే.. జోస్ బట్లర్ (కెప్టెన్ / వికెట్ కీపర్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, సామ్ కరాన్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పార్కిన్సన్, జో రూట్, జాసన్ రాయ్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ

టాపార్డర్లో వారు
ఇంగ్లాండ్ జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవ లేదు. దాదాపు 8వ నంబర్ ప్లేయర్ వరకు సమర్థంగా బ్యాటింగ్ చేసే ప్లేయర్లు ఆ జట్టుకు ఉండడం ప్లస్ పాయింట్. ఇక 15మందితో కూడిన జట్టులో చాలా మంది ప్రస్తుతం తమ కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. ఇక తొలి వన్డే కోసం జట్టులో స్ట్రాంగ్ ప్లేయర్లను తీసుకోనున్నారు. బెయిర్‌స్టో రావడంతో ఓపెనర్ అయిన జాసన్ రాయ్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. ఓపెనర్లుగా కెప్టెన్ బట్లర్, బెయిర్ స్టో బరిలోకి దిగుతారు. ఇక వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా బట్లర్ చూసుకుంటాడు. ఇక వన్ డౌన్లో మిస్టర్ క్లాస్ జో రూట్ బరిలోకి దిగుతాడు. దీంతో ఇంగ్లాండ్ టాపార్డర్ దుర్భేద్యంగా కన్పిస్తోంది. ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డేల్లో బట్లర్ అరివీర భీకరంగా ఆడగా.. టెస్టుల్లో న్యూజిలాండ్, ఇండియా మీద రూట్, బెయిర్ స్టో చెలరేగిన సంగతి తెలిసిందే.

ముగ్గురు నిఖార్సైన ఆల్రౌండర్లు..
ఇక ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద సానుకూలాంశం ఆ జట్టులో నిఖార్సైన ఆల్రౌండర్లు ఉండడం. జట్టులో నాలుగో స్థానంలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న లియామ్ లివింగ్ స్టోన్ బరిలోకి దిగొచ్చు. 5వ స్థానంలో టెస్ట్ కెప్టెన్, మ్యాచ్ టర్నర్ అయిన బెన్ స్టోక్స్, 6వ స్థానంలో ఫినిషర్ అయిన మొయిన్ అలీ బరిలోకి దిగే వీలుంది. వీళ్లు ముగ్గురు మంచి ఆల్రౌండర్లు. అందువల్ల జట్టుకు బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ప్లస్ అవుతారు.

బౌలర్లుగా వీరు..
ఇక బౌలర్ల లిస్టులో స్పెషలిస్టు స్పిన్నర్‌గా మ్యాథ్యూ పార్కిన్సన్ తుది జట్టులోకి ఎంపికవ్వొచ్చు. ఇక పేసర్లుగా సామ్ కరన్, క్రైగ్ ఓవర్టన్, డేవిడ్ విల్లీ, రీస్ టోప్లే బరిలోకి దిగడం ఖాయంగా కన్పిస్తుంది. ఇక కరాన్ హిట్టర్ అనే సంగతి తెలిసిందే. ఇక క్రైగ్ ఓవర్టన్ సైతం మంచి బ్యాటరే. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో అతను 97పరుగులు చేశాడు. ఇక డేవిడ్ విల్లీ కొద్దో గొప్పో బానే బ్యాటింగ్ చేయగలడు. సో ఈ ముగ్గురు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్లోనూ ఇంగ్లాండ్‌కు ఉపయుక్తం కానున్నారు. ఇక రీస్ టోప్లే మూడో టీ20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విషయం ఎరుకే.

తొలి వన్డేకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఇదే..
1.జోస్ బట్లర్ (కెప్టెన్ /వికెట్ కీపర్), 2.జానీ బెయిర్‌స్టో, 3.జో రూట్, 4.లియామ్ లివింగ్‌స్టోన్, 5.బెన్ స్టోక్స్, 6.మొయిన్ అలీ, 7.సామ్ కరన్, 8.క్రెయిగ్ ఓవర్‌టన్, 9.డేవిడ్ విల్లీ, 10.మాట్ పార్కిన్సన్, 11.రీస్ టోప్లీ .

భారత వన్డే జట్టు
ఇకపోతే మరో పక్క ఆ వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టులో 17మంది సభ్యులు ఉన్నారు. ఇండియా స్క్వాడ్‌ను ఓసారి లుక్కేస్తే.. రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ప్రసీద్ కృష్ణ, బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.

తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11
ఇక ఇంగ్లాండ్ లాంటి టీంకు పోటి ఇవ్వాలంటే భారత్ తుది జట్టు అత్యంత పటిష్ఠంగా ఉండాల్సిన అవసరముంది. ఓసారి తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 అంచనా వేస్తే..
1.రోహిత్ శర్మ (కెప్టెన్), 2 శిఖర్ ధావన్, 3 విరాట్ కోహ్లీ, 4.సూర్యకుమార్ యాదవ్, 5.హార్దిక్ పాండ్యా, 6.రిషబ్ పంత్ (వికెట్ కీపర్), 7.రవీంద్ర జడేజా 8.ప్రసీద్ క్రిష్ణ, 9. మహమ్మద్ షమీ, 10.జస్ప్రీత్ బుమ్రా, 11.యుజ్వేంద్ర చాహల్


Click it and Unblock the Notifications












