
జాస్ బట్లర్‌కు స్వాగతం పలికిన దారుణ ఓటమి
పూర్తి స్థాయి కెప్టెన్‌గా జాస్ బట్లర్‌కు వన్డేల్లో అత్యంత దారుణ ఓటమి స్వాగతం పలికింది. ఇక ఛేజింగ్లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (76పరుగులు 58బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సర్లు నాటౌట్), శిఖర్ ధావన్ (31పరుగులు 54బంతుల్లో 4ఫోర్లు నాటౌట్) ఓపెనింగ్ జోడీ విజయలాంఛనాన్ని సగర్వంగా ముగించింది. దీంతో సిరీస్లో ఇండియా 1-0తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది. బౌలింగ్లో 6/19ప్రదర్శనతో ఇంగ్లాండ్ పిప్పి రాల్చిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ధావన్ లక్కీగా బతికిపోయాడు
మ్యాచ్ విషయానికొస్తే 111పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా.. సులువుగా లక్ష్యాన్ని చేరుకుంది. ఇకపోతే ఇన్నింగ్స్ తొలి బంతికే ధావన్ గోల్డెన్ డక్ మిస్సయ్యాడు. రోహిత్ సింగిల్ రన్ కోసం కాల్ ఇవ్వగా.. ధావన్ నాన్ స్ట్రైక్ ఎండ్ నుంచి డౌట్ ఫుల్‌గా బయలుదేరాడు. మిడ్ వికెట్లో బెయిర్ స్టో వెంటనే బంతి అందుకున్నాడు. అయితే అతను వేసిన త్రో వికెట్లకు తాకకపోవడంతో ధావన్ బతికిపోయాడు. ఇక ఆ తర్వాత 3ఓవర్ చివరి బంతికి కూడా ధావన్ రన్ ఔటయ్యేవాడు కానీ మళ్లీ లైఫ్ దక్కింది. ఇక ఆ తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ నల్లేరు మీద నడకలా సాగింది.

ఫుల్ షాట్లతో రోహిత్ శర్మ ట్రేడ్‌మార్క్ బ్యాటింగ్
5ఓవర్లో తన ట్రేడ్ మార్క్ షాట్ అయిన ఫుల్ షాట్‌తో రోహిత్ సిక్సు కొట్టి తన దూకుడు మొదలెట్టాడు. తొలుత ధావన్ చాలా తడబడుతూ కన్పించాడు. కానీ టోప్లే వేసిన 7వ ఓవర్లో 3ఫోర్లు కొట్టి కాస్త టచ్‌లోకి వచ్చాడు. ఆ ఓవర్లో 16పరుగులొచ్చాయి. 10వ ఓవర్లో ఓవర్టన్ వేయగా.. చూడచక్కని సిక్స్ కొట్టిన రోహిత్ తర్వాత బంతికి ఫోర్ కూడా బాదాడు. దీంతో 10ఓవర్లకు స్కోరు 56కు చేరుకుంది. ఇక అడపాదడపా బౌండరీలతో స్కోరు సజావుగా సాగిపోతున్న తరుణంలో 15ఓవర్ కార్స్ బౌలింగ్లో చివరి బంతికి రోహిత్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ రివ్యూ తీసుకుంది. ఇక రివ్యూలో అంపైర్ కాల్ అని రావడంతో కెప్టెన్ సాబ్ బతికిపోయాడు.

వన్డేల్లో 250సిక్సులు పూర్తి చేసుకున్న రోహిత్
17వ ఓవర్లో డౌన్ లెగ్‌లో సూపర్ సిక్స్ కొట్టిన రోహిత్ తన ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో మరో సిక్స్, ఫోర్ బాదడంతో 18పరుగులొచ్చాయి. 18వ ఓవర్లో 100పరుగుల భాగస్వామ్యం కూడా పూర్తయింది. 19వ ఓవర్లో రోహిత్ ఓ సిక్స్ కొట్టి సింగిల్ తీయడంతో స్కోర్స్ లెవల్ అయ్యాయి. దీంతో వన్డేల్లో తన 250వ సిక్స్ కూడా పూర్తయింది. ఇక ధావన్ విన్నింగ్ షాట్ ఫోర్ కొట్టడంతో భారత్ 10వికెట్ల తేడాతో గెలుపొందింది.

వణికించిన బుమ్రా
అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ మామూలుగా పడలేదు. బుమ్రా (7.2-3-19-6) 6వికెట్ల హాల్ ప్రదర్శనకు ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. షమీ 3వికెట్లు, ప్రసీద్ 1వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ పతనం ఓ రేంజులో సాగింది. ఒకానొక దశలో 26పరుగులకే 5వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 100పరుగులు దాటిందంటే అందుక్కారణం.. కెప్టెన్ బట్లర్ (30), డేవిడ్ విల్లీ (21) కాస్త ఆదుకోవడమే. ఇంగ్లాండ్ ప్లేయర్లలో రాయ్, రూట్, స్టోక్స్, లివింగ్ స్టోన్ డక్ ఔట్ కావడం గమనార్హం.

తుది జట్లు :
ఇండియా ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ(c), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 : జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ


Click it and Unblock the Notifications












