టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఇంగ్లాండ్ పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతోన్న తొలి వన్డే లో ఈ ఘతన సాధించాడు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన అతడు.. జాకోబ్ బెథెల్ వికెట్ పడగొట్టడంతో అత్యధిక వికెట్ల మార్క్ ను టచ్ చేశాడు. మొత్తంగా అతడు ఇంగ్లాండ్ పై ఇప్పటి వరకు 41 వికెట్లు తీశాడు.
వన్డేల్లో ఇంగ్లాండ్ పై అత్యధిక వికెట్లు తీసింది వీరే
41 రవీంద్ర జడేజా *
40 జేమ్స్ అండర్సన్
37 యాండ్రూ ఫ్లింటాఫ్
36 హర్భజన్ సింగ్
35 జవగళ్ శ్రీనాథ్, అశ్విన్

600 వికెట్లు..
ఇంకా ఈ మ్యాచ్ లో మరో రికార్డు కూడా సాధించాడు జడేజా. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన 5వ భారత బౌలర్‌గా, 4వ భారత స్పిన్నర్ గానూ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అనిల్ కుంబ్లే (401 మ్యాచుల్లో 953 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (287 మ్యాచుల్లో 765 వికెట్లు), హర్భజన్ సింగ్ (365 మ్యాచుల్లో 707 వికెట్లు), కపిల్ దేవ్ (356 మ్యాచుల్లో 687 వికెట్లు) భారత్ తరుపున అత్యధిక వికెట్లు పడగొట్టారు.మొత్తంగా ప్రస్తుతం జరుగుతోన్న మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 1 మెయిడిన్ ఓవర్ వేసి.. కేవలం 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.