For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ind vs Eng 1st ODI : అందుకే బౌలింగ్ ఎంచుకున్న రోహిత్.. కోహ్లీ ఔట్, నంబర్ 3లో అతనే, ఇండియా తుది జట్టు..!

Ind vs Eng 1st ODI : India Won the Toss and Elected Bowl, Both Team Playing 11 Are?

ఇంగ్లాండ్ మీద ఇటీవల టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా ఇక ఆ జట్టుతో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. వన్డే సిరీస్‌లోనూ టీ20తరహా జోరు కొనసాగించాలని టీమిండియా చూస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగే తొలి వన్డే లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో మధ్యాహ్నం 1గంటకు ప్రారంభం కానుంది. ఇక ఇండియా లోకల్ టైం ప్రకారం.. మ్యాచ్ సాయంత్రం 5.30కు ప్రారంభమవుతుంది. మ్యాచ్ ముగిసేసరికి అర్ధరాత్రి 2గంటలు అవుతుంది.

ఇకపోతే ఇంగ్లాండ్ టీ20లో ఓడిపోయి దెబ్బతిన్నందున.. వన్డే సిరీస్‌ను ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఇటీవలే ఈయన్ మోర్గాన్‌ రిటైర్మెంట్ ప్రకటించడంతో జోస్‌ బట్లర్‌ టీ20, వన్డేలకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఇండియా లాంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోనుండడం బట్లర్‌కు కూడా సవాలే. అయితే బెన్‌ స్టోక్స్, రూట్‌, బెయిర్ స్టో లాంటి స్టార్ ప్లేయర్లు వన్డే టీంలోకి రావడంతో అతనికి కొండంత అండ లభించడం ఖాయం.

ఛేదనకు నిర్దిష్ట స్కోరు మా ముందు ఉండాలనుకున్నా

ఛేదనకు నిర్దిష్ట స్కోరు మా ముందు ఉండాలనుకున్నా

ఇక ఈ మ్యాచ్ టాస్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ ఎంచుకుంటాం. పిచ్ కొంత గ్రాస్‌తో కప్పబడి ఉంది. కాస్త వెదర్ కూడా మేఘావృతమై ఉంది. పైగా తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి సూర్యాస్తమయం అవుతుంది.

అప్పుడు మాకు కొంచెం ఎడ్జ్ ఉంటుందనిపిస్తుంది. ఇక ఛేదనకు నిర్దిష్టంగా ఓ స్కోరు మా ముందు ఉండాలి. షమీ, బుమ్రా బంతిని బాగా స్వింగ్ చేయగలరు. ముందుగా వికెట్లు తీయడం, స్కోరింగ్‌కు బ్రేకులు వేయడం చాలా ముఖ్యం. విదేశాల్లో ఆడే ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాం. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ రాణించాలనుకుంటున్నాం. మా జట్టులో ఐదుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లు ఉన్నారు. కోహ్లీ ఈ గేమ్ ఆడట్లేదు. అతని స్థానంలో శ్రేయస్ నంబర్ 3స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అని పేర్కొన్నాడు.

 గజ్జల్లో గాయం కారణంగా విరాట్ దూరం

గజ్జల్లో గాయం కారణంగా విరాట్ దూరం

మూడో టీ20 సందర్భంగా విరాట్‌కు గజ్జల్లో గాయమైంది. అయితే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడా.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడా అనేది ఇంకా స్పష్టత లేదు. అయితే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడే ఈ గాయమైందని స్పష్టమవుతుంది. ఎందుకంటే కోహ్లీ పెద్ద ఇన్నింగ్సేం ఆడలేదు. ఫీల్డింగ్ టైంలో ఓ ఫోర్ ఆపే క్రమంలో డైవ్ చేశాడు. కానీ బంతి ఆగలేదు. అప్పుడే గాయపడ్డట్టున్నాడు. గజ్జలో నొప్పి కారణంగా అతనికి విశ్రాంతి తప్పకుండా అవసరమైంది. అందువల్ల విరాట్ తొలి వన్డేకు అందుబాటులో లేడు. ఇక రెండు, మూడు వన్డేలకు అతను అందుబాటులోకి రావొచ్చు.

రూట్, స్టోక్స్, బెయిర్ స్టో వచ్చేశారు..

రూట్, స్టోక్స్, బెయిర్ స్టో వచ్చేశారు..

టాస్ ఓడిన కెప్టెన్ బట్లర్ మాట్లాడుతూ.. మేము టాస్ గెలిస్తే మేం కూడా బౌలింగే ఎంచుకునేవాళ్లం. ఇకపోతే నేను నా గురించి, నా కెప్టెన్సీ పాత్ర గురించి చాలా నేర్చుకుంటున్నాను. వన్డే సిరీస్ కోసం చాలా ఎదురుచూస్తున్నా. ఇది నాకు గొప్ప ప్రాక్టీసుతో కూడిన అనుభవాన్ని ఇస్తుంది. ఇకపోతే మా జట్టు తరఫున రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్ బరిలోకి దిగనుండడం సంతోషం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో వీరిని పేర్కొంటుంటారు. ఈరోజు మేం తప్పకుండా గెలుస్తామని నమ్మకముంది.

తుది జట్లు

తుది జట్లు

ఇండియా ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ(c), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 : జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ

Story first published: Tuesday, July 12, 2022, 17:30 [IST]
Other articles published on Jul 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+