Ind vs Eng 1st ODI : ఇంగ్లాండ్ తుక్కురేగ్గొట్టిన బుమ్రా.. గుండు సున్నాకే నలుగురు ఔట్..! 26కే 5వికెట్లు

ఇంగ్లాండ్ మీద ఇటీవల టీ20 సిరీస్ గెలిచిన జోరు కనబర్చిన టీమిండియా ఇక ఆ జట్టుతో వన్డే సిరీస్‌లోనూ టీ20తరహా జోరు కొనసాగిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న తొలి వన్డేలో బూమ్ బూమ్ బుమ్రా ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికిస్తున్నాడు. ఇక తొలి స్పెల్‌లో షమీ, బుమ్రా బౌలింగ్‌కు దిగగా క్రీజులో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు.
భువనేశ్వర్ కుమార్ లేని లోటును కన్పించకుండా వీరిద్దరూ పవర్ ప్లేలో తమ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను వచ్చినోళ్లను వచ్చినట్లు పెవిలియన్‌కు పంపించారు. ఇక బుమ్రా దెబ్బకు ఆ జట్టులోని నలుగురు బ్యాటర్లు రాయ్, రూట్, స్టోక్స్, లివింగ్ స్టోన్ గుండుసున్నాకే ఔటయ్యారు. ఇక ఇంగ్లాండ్ 26పరుగులకే 5వికెట్లు కోల్పోయింది. క్రీజులో బట్లర్, మొయిన్ అలీ కాస్త పోరాడుతున్నారు.

టాపార్డర్ భరతం పట్టిన బుమ్రా
ఇక ఈ మ్యాచ్ టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నందుకు బౌలర్లు ఫలితం చూపించారు. తొలుత ఇంగ్లాండ్ ఓపెనర్లు జాసన్ రాయ్, బెయర్ స్టో బరిలోకి దిగారు. తొలి ఓవర్లో షమీ బౌలింగ్ వేయగా.. బెయిర్ స్టో ఓ ఫోర్ కొట్టాడు. ఇక రెండో ఓవర్లో బుమ్రా బంతి అందుకున్నాడు. బుమ్రా స్వింగ్‌కు క్రీజులో ఉన్న జాసన్ రాయ్ చాలా తడబడ్డాడు. ఇక 4వ బంతికి బుమ్రా వేసిన వైడ్ ఆఫ్ స్టంప్ బంతిని రాయ్ హిట్టింగ్ చేయాలని చూడగా.. బంతి బ్యాట్ అడుగుకు తాకి వికెట్లను గిరటేసింది. దీంతో సున్నాతో రాయ్ పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఆ తర్వాత మిస్టర్ క్లాస్ రూట్ బ్యాటింగ్‌కొచ్చాడు. బుమ్రా అదే ఓవర్ చివరి బంతిని స్వింగ్ వేయగా.. రూట్ బ్యాట్‌కు బాల్ ఎడ్జ్ అయి కీపర్ సైడ్ వెళ్లింది. పంత్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో రూట్ సైతం (0)కే క్రీజు వీడాడు. ఆ తర్వాత 3వ ఓవర్లో షమీ బౌలింగ్లో బెన్ స్టోక్స్ (0) సైతం కీపర్ క్యాచ్ ఔటయిపోయాడు. దీంతో 7పరుగులకే ఇంగ్లాండ్ 3వికెట్లు కోల్పోయింది.

బుమ్రా ప్రతాపానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు బెంబేలు
ఇక క్రీజులోకి కెప్టెన్ జాస్ బట్లర్ వచ్చాడు. వచ్చీ రాగానే రెండు ఫోర్లు కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు. ఇక బుమ్రా మాత్రం తన ప్రతాపాన్ని ఏమాత్రం ఆపలేదు. అతని నిప్పులు చెరిగే బంతులకు ఇంగ్లాండ్ బ్యాటర్ల వల్ల కాలేదు. ప్రమాదకర బెయిర్ స్టో (7పరుగులు 20బంతుల్లో 1ఫోర్) సైతం బుమ్రా వేసిన 6వ ఓవర్ 3వ బంతికి ఔటయిపోయాడు. రిషబ్ పంత్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో బెయిర్ స్టో ప్రమాదం తప్పింది. ఇక అదే మోకాలో 8వ ఓవర్ 5బంతికి ఆల్రౌండర్ అయిన లియామ్ లివింగ్ స్టన్ (0)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో డకౌట్‌తో అతను పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 8ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 26పరుగులకే 5వికెట్లు కోల్పోయింది. ఇక బుమ్రా తన 4ఓవర్లలో కేవలం 6పరుగుల మాత్రమే ఇచ్చి 4వికెట్లు తీశాడు. అందులో ముగ్గురు డకౌట్ కావడం గమనార్హం.

తుది జట్లు :
ఇండియా ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ(c), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 : జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications