For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేన దండయాత్రకు వరుణుడు బ్రేక్ వేస్తాడా?: ఫలితం తేలే చివరిరోజు వర్షం పడుతుందా?

IND vs END 1st test day 5 weather report: Dark clouds hovering over Trent Bridge, but no rain today

లండన్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తోంది. నాటింగ్‌హామ్ ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా సాగుతోన్న ఈ మ్యాచ్ చివరి రోజు.. భారత్ గెలవాంటే 157 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. భారత బ్యాట్స్‌మెన్లు దూకుడుగా మ్యాచ్ ఆడితే లంచ్ లోపే మ్యాచ్ ముగుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇంగ్లాండ్ బౌలర్లు కూడా విజృంభించడానికి అవకాశాలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించకపోవడం కలవరపాటుకు గురి చేస్తోంది.

ఓపెనర్ కేఎల్ రాహుల్, లోయర్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా క్రీజ్‌లో కుదురుకోకపోయి ఉంటే.. మ్యాచ్ స్వరూపం వేరుగా ఉండేది. తొలి ఇన్నింగ్‌లో టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్లు సత్తా చాటలేకపోవడం ఒకింత ఆందోళనకు గురి చేసేదే. బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ మీద చివరి రోజు టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తి రేపుతోంది. మ్యాచ్‌ను ఉత్కంఠ భరితంగా మార్చివేసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా తలో 12 పరుగులతో క్రీజ్‌లో నాటౌట్‌గా ఉన్నారు.

తొలి ఇన్నింగ్‌లో 84 పరుగులు చేసి.. మ్యాచ్‌ను భారత్ వైపు మొగ్గేలా చేసిన కేఎల్ రాహుల్ 26 పరుగులు చేసిన అవుట్ అయ్యాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడతను. గెలుపు చేతికి అందేంత దూరంలో నిలిచి ఉంది టీమిండియా. ఒకరోజంతా ఆట మిగిలి ఉన్నందున.. ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడం ఖాయమే.. విక్టరీ లాంఛనప్రాయమే అవుతుంది. మ్యాచ్ డ్రాగా ముగియడానికి ఎలాంటి అవకాశం లేదు. భారత్, ఇంగ్లాండ్‌లల్లో తొలి టెస్ట్ మ్యాచ్ విజేతగా ఎవరు నిలుస్తారనేది తేలడం ఖాయం. వర్షం అడ్డుగా ఉంటే తప్ప మ్యాచ్ కొనసాగడానికే అవకాశం ఉంది.

ప్రస్తుతం ట్రెంట్‌బ్రిడ్జిలో వాతావరణం సాధారణంగానే కనిపిస్తోంది. నాలుగో రోజు ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో.. దాదాపుగా అదే తరహా వెదర్ చివరిదైన అయిదో రోజు కూడా నెలకొని ఉంది. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో వర్షం కురిసే అవకాశాలు 30 శాతమే ఉన్నట్లు బ్రిటన్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. ఉష్ణోగ్రత 16 శాతంగా నమోదైంది. సమయం గడుస్తున్న కొద్దీ టెంపరేచర్ ఒకట్రెండు డిగ్రీల మేర పెరగొచ్చని అభిప్రాయపడుతున్నారు. తెల్లవారు జామున వర్షం పడటానికి 70, ఒంటిగంట తరువాత 30 శాతమే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే- మ్యాచ్ ఫలితం తేలడానికి వరుణుడు కూడా అడ్డుపడకపోవచ్చు.

Story first published: Sunday, August 8, 2021, 7:52 [IST]
Other articles published on Aug 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+