బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. కాన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో వర్షం కారణంగా దాదాపు రెండున్నర రోజుల ఆట కోల్పోయినప్పటికీ టీమిండియా గొప్పగా పోరాడి మ్యాచ్‌ను గెలుచుకుంది. 173.2 ఓవర్లలో ముగిసిన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో చిన్న మ్యాచ్.
వరుణుడు ప్రతాపంతో తొలి రోజు 35 ఓవర్లు మాత్రమే ఆట జరిగిన విషయం తెలిసిందే. రెండో రోజు, మూడో రోజు పూర్తిగా రద్దయింది. నాలుగో రోజు ఆటలో భారత్ అద్భుతంగా ఆడింది. బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేసి విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆధిక్యాన్ని సాధించింది. అయితే బంగ్లాదేశ్ త్వరగా ఆలౌట్ కావడంలో బౌలర్ల కృషితో పాటు ఫీల్డర్ల అబ్బురపరిచే విన్యాసాలు కీలక పాత్ర పోషించాయి.

గాల్లోకి ఎగురుతూ రోహిత్ స్టన్నింగ్ క్యాచ్‌తో లిటన్ దాస్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. కాసేపటికే సిరాజ్ అద్భుత రీతిలో వెనక్కి పరిగెడుతూ గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఈ నమ్మశక్యం కాని క్యాచ్‌ను చూసి షకిబ్ సైతం ఆశ్చర్యపోతూ పెవిలియన్‌కు చేరాడు. ఇది మ్యాచ్‌లో భారత్‌ను పైచేయి సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. రోహిత్, సిరాజ్‌తో పాటు యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ కూడా చక్కని క్యాచ్‌లు అందుకున్నారు.
దీంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ సంపద్రాయం ప్రకారం అందించే 'ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్' అవార్డుకు రోహిత్, సిరాజ్, రాహుల్, జైస్వాల్ పోటీపడ్డారు. అయితే టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ సిరాజ్-జైస్వాల్‌ను సంయుక్తంగా అవార్డు అందజేశారు. రోహిత్ తన వాచ్‌లా పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడని దిలీప్ అన్నాడు. స్లిప్‌లో రాహుల్, జైస్వాల్ చక్కగా అందుకున్నాడని, సిరాజ్ అద్భుత రీతిలో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడని దిలీప్ కొనియాడాడు. అయితే ఈసారి ఈ అవార్డు జైస్వాల్, సిరాజ్‌కు దక్కిందని చెప్పాడు. అనంతరం మెడల్స్‌ను సిరాజ్, జైస్వాల్ ఒకరికొకరు వేసుకున్నారు.