భారత్ ముందు పెద్ద గండం - అన్ని జట్లూ దీని బారిన పడ్డాయి కానీ..!!

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు ఇవ్వాళ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. బంగ్లాదేశ్‌తో తలపడబోతోంది. తన మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయాన్ని చవి చూసిన తరువాత- ఇప్పుడిక బంగ్లాను ఎదుర్కొనబోతోంది. ఒక ఓటమి తరువాత ఆడబోతోన్న మ్యాచ్ కావడం వల్ల అందరి దృష్టీ ఈ మ్యాచ్‌పైనే నిలిచింది. పైగా భారత్‌ను టీ20 ప్రపంచకప్‌లో ఓడిస్తామంటూ బంగ్లాదేశ్ కేప్టెన్ షకీబుల్ హసన్ ఇప్పటికే మాటల యుద్ధానికి తెర తీసిన నేపథ్యంలో- రోహిత్ సేన ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఓటమి తరువాత
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈ టోర్నమెంట్‌లో తొలుత పాకిస్తాన్, అనంతరం నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. ఇక తన నాలుగో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టబోతోంది. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అడిలైడ్ స్టేడియం దీనికి వేదిక. ఇదొక్కటే కాకుండా మరో మ్యాచ్ కూడా ఇవ్వాళ షెడ్యూల్ అయింది. నెదర్లాండ్స్- జింబాబ్వే ఆడబోతోన్నాయి. ఈ ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

మెయిన్ విలన్..
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో వర్షం మెయిన్ విలన్ క్యారెక్టర్‌ను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వాష్డ్ అవుట్ అయ్యాయి. పలు మ్యాచ్‌లు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. మరి కొన్నింటి ఓవర్లను కుదించాల్సి వచ్చింది. వర్షం బెడద ఇవ్వాళ కూడా ఉండే అవకాశం ఉన్నాయనేది ఆందోళనకు గురి చేస్తోంది.

60 శాతం
మధ్యాహ్నం అడిలైడ్‌లో వర్షం పడొచ్చనే అంచనాలు ఉన్నాయి. అడిలైడ్‌లో వర్షం పడటానికి 60 శాతం అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా వాతావరణ విభాగం- బ్యూరో ఆఫ్ మెటెరాలజీ అభిప్రాయపడింది. ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. 15 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, గాలిలో తేమ 55 శాతం ఉంటుందనిపేర్కొంది. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఇప్పటికే టీమిండియా ప్లేయర్లు ఇన్ డోర్‌లో ప్రాక్టీస్ చేసిన విషయం తెలిసిందే.

బ్యాటింగ్ ఫ్రెండ్లీ..
అడిలైడ్ ఫ్లాటెడ్ పిచ్. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లకు సహకరిస్తుంది. మొదట్లో ఫాస్ట్ బౌలర్లకు, మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. మొత్తం మీద బ్యాటింగ్‌కు అనుకూలం. రిథమ్‌ను అందిపుచ్చుకున్న బ్యాటర్‌ను అవుట్ చేయాలంటే ఈ పిచ్ బౌలర్లు శ్రమించక తప్పదు. బంగ్లాతో పోల్చుకుంటే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. బౌలింగ్ కూడా అదే స్థాయిలో ఉంటోంది.

తుదిజట్టులో..
టీమిండియా తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో- నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కేప్టెన్), అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్ ఆడొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications