Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ వర్సెస్ జింబాబ్వే - అన్నీ సవ్యంగా సాగుతాయా..!!

IND vs BAN, Weather and pitch report of the Melbourne, What are the chances of rain

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భారత క్రికెట్ జట్టు ఇవ్వాళ తన చిట్టచివరి మ్యాచ్ ఆడబోతోంది. జింబాబ్వేతో తలపడటానికి సమాయాత్తమౌతోంది. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. ఇదొక్కటే కాకుండా ఇవ్వాళ మూడు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా.. నెదర్లాండ్స్‌తో పోరాడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

ఛేజింగ్‌లో ప్రొటీస్ తడబడుతోంది. నాలుగు వికెట్లు నష్టపోయి 90 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్స్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సి ఉంటుంది. కాగా- నాలుగు మ్యాచ్‌లల్లో మూడు విజయాలతో గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచింది భారత్. ఇప్పటికే సెమీ ఫైనల్స్ బెర్త్ దాదాపుగా కన్‌ఫర్మ్ చేసుకుంది. సూపర్ 12 దశలో దక్షిణాఫ్రికాపై మాత్రమే ఓడిపోయింది. ఇదే గ్రూప్‌లో ఉన్న జింబాబ్వే ఒకే ఒక గెలుపుతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉంది.

కాగా భారత్-జింబాబ్వేల మధ్య మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ప్రస్తుతం వాతావరణం సానుకూలంగా ఉంటోంది. వర్షం పడే అవకాశాలు దాదాపుగా లేవు. ఆకాశం నిర్మలంగా ఉంది. పగటి పూట తేలికపాటి జల్లులు కురుస్తాయని ఆస్ట్రేలియా వాతావరణం విభాగం బ్యూరో ఆఫ్ మెటెరాలజీ తెలిపింది. మ్యాచ్‌కు ఆటంకం కలిగించేలా వర్షం పడకపోవచ్చని అంచనా వేసింది.మెల్‌బోర్న్ కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల తరువాత ఓ మోస్తరుగా వర్షం పడటానికి 30 శాతం అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

మెల్‌బోర్న్ పిచ్ గురించి తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్‌లను ఆడింది టీమిండియా ఇక్కడ. తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించింది రోహిత్ సేన. ఇదే మెల్‌బోర్న్‌లో వర్షం వల్ల వరుసగా మూడు మ్యాచ్‌లు వాష్డ్ అవుట్ అయ్యాయి. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లకు సహకరించే పిచ్ ఇది. మొదట్లో ఫాస్ట్ బౌలర్లకు, మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. మొత్తం మీద బ్యాటింగ్‌కు అనుకూలం.

టీమిండియా తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. జింబాబ్వేలో- వెస్లీ మధేవెరే, క్రెయిగ్ ఎవాన్స్, రెగిస్ చకబ్వా, సీన్ విలియమ్స్, సికందర్ రజా, మిల్టన్ షుంబా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వీ, రిచర్డ్ ఎన్‌గరవా, టెండై చటారా, బ్లెస్సింగ్స్ ముజరబని ఆడొచ్చు.

Story first published: Sunday, November 6, 2022, 8:30 [IST]
Other articles published on Nov 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+