IND vs BAN: కొంపముంచిన కోహ్లి బలహీనత..రోహిత్ రియాక్షన్ వైరల్! (Video)
దాదాపు ఎనిమిది నెలల అనంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తిరిగి టెస్టు క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. చెపాక్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగాడు. కానీ ఆరు పరుగులకే వెనుదిరిగాడు. హసన్ మహ్మద్ వేసిన ఆఫ్ స్టంప్ అవతల బంతిని వెంటాడుతూ వికెట్ కీపర్ లిటన్ దాస్ చేతికి చిక్కాడు. మరోసారి తన బలహీనతతో వికెట్ సమర్పించుకున్నాడు.
జట్టును ఆదుకునే స్థితిలో క్రీజులోకి వచ్చిన కోహ్లి తన తొందరపాటు దూకుడుతో వికెట్‌ను సమర్పించుకోవడమే కాకుండా టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. అసలేం జరిగిందంటే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ హసన్ మహ్మద్ ధాటికి పది ఓవర్లలోపే ముగ్గురు స్టార్ బ్యాటర్ల వికెట్లను కోల్పోయింది. ఆరో ఓవర్ తొలి బంతికి టీమిడియా కెప్టెన్ రోహిత్ శర్మ (6; 19 బంతుల్లో, 1 ఫోర్)ను హసన్ మహ్మద్ ఔట్ చేశాడు.

షాట్‌కు యత్నించిన రోహిత్ స్లిప్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్‌లో శుభ్‌మన్ గిల్‌ను హసన్ డకౌట్ చేశాడు. లెగ్‌సైడ్ దిశగా వెళ్తున్న బంతిని వెంటాడి గిల్ వికెట్ కీపర్ లిటన్ దాస్‌కు దొరికిపోయాడు. దాంతో 28 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో కింగ్ కోహ్లి (6; 6 బంతుల్లో) క్రీజులోకి వచ్చాడు. సీమర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఎదురుదాడికి దిగడమే ఉత్తమం అని భావించి కోహ్లి ధాటిగా ఆడాడు.
తన ట్రేడ్ మార్క్ ఫ్లిక్ షాట్‌తో ఆకట్టుకున్నాడు కూడా. బంతికి తగ్గట్లుగా ఆడుతూ పాజిటివ్‌గా కనిపించాడు. కానీ హసన్ మహ్మద్ వేసిన లైన్ అండ్ లెంగ్త్ బంతిని డ్రైవ్‌కు ట్రై చేసి వికెట్ కోల్పోయాడు. నాలుగో, అయిదో స్టంప్ దిశగా వేసే బంతులను షాట్‌కు యత్నించి కోహ్లి గతంలో వికెట్లు సమర్పించుకునేవాడని తెలిసిందే. అయితే ఇది ఆఫ్ స్టంప్‌కు మరింత అవతలగా వెళ్లిన బంతిని వెంటాడి ఔటయ్యాడు. దాంతో భారత్ 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లి ఔటైనప్పుడు రోహిత్ ఫ్రస్టేషన్ రియాక్షన్ వైరల్‌గా మారింది.
కోహ్లి కుదురుకుని గేర్ మార్చి ఉండి ఉంటే టీమిండియా మెరుగైన స్థితిలో ఉండేదని, విరాట్ మరోసారి తన కవర్ డ్రైవ్‌తో వికెట్ సమర్పించుకునే బలహీనతను బయటపెట్టకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం భారత్ 34 ఓవర్లకు 130/4 స్కోరుతో ఉంది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (50*), కేఎల్ రాహుల్ (5*) ఉన్నారు. లంచ్ విరామం తర్వాత రిషభ్ పంత్ (39) ఔటయ్యాడు.
Virat kohli got out & the crowd is still cheering. 😭
— Rp17 (@HarshadSarode13) September 19, 2024
Reason : Rishabh pant #CricketUpdatespic.twitter.com/KmFI59xjjO
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications