మరో వారం రోజుల్లో భారత్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. నజ్ముల్ హొస్సేన్ షాంటో సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును వెల్లడించింది. ఇటీవల పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ఆడిన జట్టునే దాదాపుగా ప్రకటించింది. జట్టులో పెద్దగా మార్పులేమి లేవు. ఫాస్ట్ బౌలర్ షోరిఫుల్ ఇస్లామ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
యువ ప్లేయర్ జేకర్ అలీకి అవకాశం ఇచ్చారు. జేకర్ అలీ కుడి చేతి వాటం బ్యాటర్. వన్డే, టెస్టుల్లో అరంగేట్రం చేయని జేకర్ 17 టీ20లు ఆడాడు. 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 41.47 సగటుతో పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు బాదాడు. ఇక షోరిఫుల్ ఇస్లామ్ గైర్హాజరీలో పేస్ బాధ్యతలను తస్కిన్ అహ్మద్, నహిద్ రానా, హసన్ మహ్మద్, ఖలీద్ అహ్మద్ మోయనున్నారు.

ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన బంగ్లాదేశ్ 2-0తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ఫార్మాట్‌లో పాక్‌పై తొలి విజయంతో పాటు తొలి టెస్టు సిరీస్ విజయం సాధించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో నాలుగో స్థానానికి ఎగబాకింది. కాగా, సెప్టెంబర్ 19 నుంచి భారత్-బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టుకు చెన్నై వేదికగా కానుంది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), షాద్మాన్ ఇస్లాం, జాకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, జేకర్ అలీ, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, నహిద్ రానా, తైజుల్ ఇస్లామ్, మహ్మదుల్ హసన్ జాయ్, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్
తొలి టెస్టుకు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.