
అంపైర్‌తో గొడవ..
ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో బంగ్లాదేశ్ కేప్టెన్ షకీబ్ అల్ హసన్.. అంపైర్‌తో గొడవ పడిన ఘటన అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొంది. నో బాల్ విషయంలో షకీబల్ హసన్ అంపైర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. కిందటి నెల 23వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ అంపైర్‌తో ఇలాగే వాగ్వివాదానికి దిగిన ఉదంతాన్ని గుర్తు చేసింది.

నాడు బాబర్..
ఆ మ్యాచ్‌లో ఫ్రీ హిట్‌లో విరాట్ కోహ్లీ మూడు పరుగులు సాధించడాన్ని బాబర్ ఆజమ్ తప్పుపట్టిన విషయం తెలిసిందే. దాన్ని డెడ్ బాల్‌గా పరిగణించాలని డిమాండ్ చేశాడు. అంపైర్‌తో గొడవకు దిగాడు. ఫ్రీ హిట్‌గా వెలువడిన బంతి స్టంప్స్‌ను తాకినందున అది డెడ్ బాల్‌గా మారుతుందని అంపైర్‌కు సూచించాడు. డెడ్ బాల్‌కు పరుగులు ఎలా తీస్తాడని ప్రశ్నించాడు. తోటి ప్లేయర్లు కూడా అతనితో కలవడంతో గ్రౌండ్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

అలాంటి సీన్ ఇక్కడా..
అలాంటి సన్నివేశమే ఇవ్వాళ కూడా భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కనిపించింది. హసన్ మహ్మద్ వేసిన ఓవర్ అది. తొలి బంతిని షార్ట్ బాల్‌గా సంధించాడు హసన్. ఆ బంతికి హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. అదే ఓవర్ చివరి బంతినీ షార్ట్ పిచ్‌గా సంధించాడు. దాన్ని లాంగ్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడిన విరాట్ కోహ్లీ సింగిల్ తీశాడు. ఆ ఓవర్‌లో అది రెండో షార్ట్ పిచ్ కావడం వల్ల దాన్ని నో బాల్‌గా గుర్తించాలంటూ అంపైర్‌ను కోరాడు. దీనితో అంపైర్ ఎరాస్మస్ దాన్ని నో బాల్‌గా ప్రకటించాడు.

మ్యాచ్ ముగిసిన తరువాత కూడా..
అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పు పట్టాడు షకీబల్ హసన్. తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. అంపైర్‌తో వాగ్వివాదానికి దిగాడు. దీనితో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ మరుసటి ఓవర్‌లో కూడా షరీఫుల్ ఇస్లాం వేసిన బంతిని హెడ్-హై వైడ్‌గా బంతిగా సూచించాడు కోహ్లీ. ఈ రెండు సంఘటనలపై మ్యాచ్ ముగిసిన తరువాత కూడా షకీబ్.. అంపైర్ ఎరాస్మస్‌తో కొద్దిసేపు వాగ్వివాదం చేయడం కనిపించింది. ఆ సమయంలో కేప్టెన్ రోహిత్ శర్మ అక్కడే ఉన్నాడు.

అయిదు పరుగుల తేడాతో..
డక్‌వర్త్ లూయిస్ విధానంలో బంగ్లాదేశ్- 16 ఓవర్లల్లో 150 పరుగులు చేయాల్సి ఉండగా.. 145 వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం. 16 ఓవర్లల్లో ఆరు వికెట్లను కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. ఈ విజయంతో భారత్.. టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్స్‌కు మరింత చేరువైంది. ఇంచ్ దూరంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే- మొత్తం ఎనిమిది పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. తన తరువాతి మ్యాచ్‌లో జింబాబ్వేను ఢీ కొట్టబోతోంది రోహిత్ సేన.


Click it and Unblock the Notifications












