కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆటలో లంచ్ విరామానికి బంగ్లాదేశ్ ఆరు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (102 బ్యాటింగ్; 176 బంతుల్లో, 16 ఫోర్లు, 1 సిక్సర్) శతకం సాధించాడు. అతనికి తోడుగా మెహది హసన్ (6 బ్యాటింగ్; 26 బంతుల్లో, 1 ఫోర్) క్రీజులలో ఉన్నాడు.
వరుణుడు ప్రతాపం చూపించడంతో తొలి రోజు 35 ఓవర్లు పాటే ఆట కొనసాగిన విషయం తెలిసిందే. రెండో రోజు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండా రద్దు అయ్యింది. అయితే ఓవర్‌నైట్ స్కోరు 107/3తో ఇవాళ ఆట ఆరంభించిన బంగ్లాదేశ్ తొలి సెషన్‌లో 31 ఓవర్లు ఎదుర్కొని 98 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు భారత ఫీల్డర్లు అద్భుత ప్రతిభ తోడవ్వడంతో ఇవాళ వికెట్లు పడ్డాయి.

బుమ్రా మ్యాజిక్‌కు ముష్పికర్ క్లీన్ బౌల్డ్ అవ్వగా, రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్‌కు లిటన్ దాస్, మహ్మద్ సిరాజ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌కు షకిబ్ అల్ హసన్ పెవిలియన్ చేరారు. అంతకుముందు బంతి కంటే ఆరు సెంటిమీటర్ల డీవేయిటేడ్‌తో ముష్ఫికర్‌ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో లిటన్ దాస్ షాట్‌కు యత్నించి మిడాఫ్‌లో ఉన్న రోహిత్ చేతికి చిక్కాడు. రోహిత్ గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో అందుకున్నాడు.
ఈ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న కాసేపటికే మహ్మద్ సిరాజ్ అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసం చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో షకిబ్ ముందుకు వచ్చి భారీ షాట్ ఆడాడు. అయితే సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడంతో గాల్లోకి లేచింది. మిడాఫ్‌లో ఉన్న సిరాజ్ బంతిని గమనిస్తూ వెనక్కి పరిగెత్తాడు. అంతేగాక గాల్లోనే వెనక్కి డైవ్ చేస్తూ ఎడమ చేతితో క్యాచ్‌ను ఒడిసిపట్టాడు.
వెనక్కి పరిగెత్తుతూ క్యాచ్ అందుకోవడమే కష్టతరం. అలాంటిది గాల్లోకి దూకుతూ సిరాజ్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టాడు. దీంతో ఇది క్యాచ్ ఆఫ్ ది ఇయర్ అంటూ నెట్టింట్లో సిరాజ్‌ను ప్రశంసిస్తున్నారు. వ్యాఖ్యాతలు సైతం ఈ క్యాచ్ మళ్లీమళ్లీ చూసినా ఎప్పటికీ బోరింగ్ అనిపించదు అని కామెంటరీ చేశారు. ప్రస్తుతం సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
• @fairytaledustt_ pic.twitter.com/yqDDcJcTCq
— V. (@was_fairytale) September 30, 2024
Another outstanding catch and this time it is @mdsirajofficial who picks up a tough one to dismiss Shakib Al Hasan.
— BCCI (@BCCI) September 30, 2024
Live - https://t.co/JBVX2gyyPf… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/RbKZKDdGAW
What a catch by Siraj #INDvsBANTEST pic.twitter.com/wdd27cADnY
— 𝔸𝕪𝕒𝕒𝕟 (@yaan_Jatt) September 30, 2024