చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. మొదట బ్యాటుతో చెలరేగిన టీమిండియా తర్వాత బంతితో విజృంభిస్తోంది. రెండో రోజు లంచ్ విరామానికి బంగ్లాదేశ్‌ను 26/3తో కష్టాల్లోకి నెట్టింది. క్రీజులో ముష్పికర్ రహీమ్ (4), నజ్ముల్ హొస్సేన్ షాంటో (15) ఉన్నారు. బంగ్లా ఇంకా 350 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 339/6తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (113; 133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. రవీంద్ర జడేజా (86; 124 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) గొప్పగా పోరాడాడు. యశస్వి జైస్వాల్ (56; 118 బంతుల్లో 9 ఫోర్లు), రిషబ్ పంత్ (39; 52 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్మద్ (5/83) వికెట్లతో మెరిశాడు. తస్కిన్ అహ్మద్ మూడు (3/55) వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌ను జస్‌ప్రీత్ బుమ్రా తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. బంగ్లా ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్ (2)ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే కాసేపటికే బంగ్లాదేశ్‌ను సిరాజ్ మరో దెబ్బకొట్టాడు. బుల్లెట్‌లా బంతిని విసిర జకీర్ హసన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ అంపైర్ ఔట్‌గా ప్రకటించలేదు. దీంతో రివ్యూకి వెళ్లమని కెప్టెన్ రోహిత్ శర్మను సిరాజ్ కోరాడు.
రోహిత్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అభిప్రాయాన్ని అడిగాడు. అయితే పంత్.. ఇది ఔట్ కాదని, రివ్యూకి వెళ్లొద్దని రోహిత్‌కు సూచించాడు. 'హైట్ పరంగా సమస్య కాదు.. కానీ లెగ్ స్టంప్ మిస్ అయ్యేలా ఉంది' అని రోహిత్‌తో పంత్ అన్నాడు. దీంతో రోహిత్ సమీక్ష కోరలేదు. కానీ రిప్లేలో ఇది ఔట్ అని తేలిసింది. అనంతరం మహ్మద్ సిరాజ్ అసహనంగా కనిపించాడు. తప్పు నాదే, సారీ అంటూ సిరాజ్‌కు పంత్ సింబాలిక్‌గా క్షమాపణలు చెప్పాడు. మరోవైపు పంత్ మాట విన్న రోహిత్..నిస్సహాయంగా నవ్వాడు.
అయితే రివ్యూకు వెళ్లకపోవడంతో బతికిపోయిన జకీర్ హసన్‌ను ఆకాశ్ దీప్ ఎక్కువసేపు క్రీజులో ఉంచలేదు. తొమ్మిదో ఓవర్ తొలి బంతికి జకీర్ హసన్ (3)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికి మోమినుల్‌ను కూడా బౌల్డ్ చేసి గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. కాగా, సిరాజ్‌కు దక్కాల్సిన వికెట్‌ను పంత్ దూరం చేసిన సంఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనికి పంత్‌తో పాటు రోహిత్ కూడా కారణమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
1- Siraj Asking For DRS
— Addy Boss 🇮🇳 (@addy__boss) September 20, 2024
2- Rohit Rejects Bcz Pant Said- Leg Se Nikal Jayega
3- Review Shows It Was Out
4- Rohit & Pant Apologise To Siraj.
Full Drama On Field.😱#JaspritBumrah #TravisHead #SanjuSamson #RavindraJadeja #RavichandranAshwin #Ashwin #RAshwin #ViratKohli𓃵… pic.twitter.com/5kT52kpIpq
— Kirkit Expert (@expert42983) September 20, 2024