IND VS BAN Gill: శతకంతో చరిత్ర సృష్టించిన గిల్.. సచిన్,ధావన్ సరసన చోటు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో ఆడిన తన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ విజయంలో కీలకంగా వ్యవహరించిన వైస్ కెప్టెన్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (101*) శతకంతో చెలరేగాడు. కెరీర్‌లో అతడికిది 8వ వన్డే సెంచరీ కాగా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే తొలి శతకం కావడం విశేషం. అలానే కెరీర్ లో 8 వన్డే సెంచరీలు బాదిన ఫాస్టెస్ట్ ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. అయితే ఈ సెంచరీ బాదడంతో గిల్ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గానే వరల్డ్ నెం.1 వన్డే బ్యాటర్ గా అవతరించిన అతడు.. తాజాగా దిగ్గజ క్రికెటర్ల సరసన చోటు సంపాదించుకున్నాడు.
సచిన్ తెందుల్కర్, ధావన్ సరసన చోటు
శుభ్‌మన్ గిల్ ఈ సెంచరీ బాదడంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలోనే శతకం బాదిన నాలుగో ప్లేయర్ గా నిలిచాడు. అంతకుముందు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, శిఖర్ ధావన్, మహ్మద్ కైఫ్ తమ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో సెంచరీలు బాదారు.

ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీలు బాదిన ప్లేయర్స్
సచిన్ తెందుల్కర్ - 141 వర్సెస్ ఆస్ట్రేలియా (1998)
మహ్మద్ కైఫ్ - 111* వర్సెస్ జింబాబ్వే (2002)
శిఖర్ ధావన్ - 114 వర్సెస్ సౌతాఫ్రికా (2013)
శుభమన్ గిల్ - 101* వర్సెస్ బంగ్లాదేశ్ (2025)
కోహ్లీ కూడా బంగ్లాదేశ్ పైనే
ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలోనే బంగ్లాదేశ్ పై గిల్ శతకం బాదగా.. విరాట్ కోహ్లీ కూడా తన వరల్డ్ కప్ అరంగేట్ర మ్యాచ్ లో బంగ్లాదేశ్ పైనే సెంచరీ బాదటం విశేషం. కాగా, తాజా మ్యాచ్ లో గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. అతడు ఆడిన గత 4 వన్డే మ్యాచుల్లో 3 సార్లు ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోవడం విశేషం.
Sensational Shubman in prolific form! 🔥
— BCCI (@BCCI) February 20, 2025
Back to Back ODI HUNDREDS for the #TeamIndia vice-captain! 🫡🫡
Updates ▶️ https://t.co/ggnxmdG0VK#BANvIND | #ChampionsTrophy | @ShubmanGill pic.twitter.com/gUW8yI8zXx
Leading the chase ✅
— BCCI (@BCCI) February 20, 2025
Hundred ✅
Win ✅
Vice Captain Shubman Gill guides #TeamIndia to victory 👏
Updates ▶️ https://t.co/ggnxmdG0VK#BANvIND | #ChampionsTrophy | @ShubmanGill pic.twitter.com/YbWSCERX6E
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications