Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: భారత జట్టు నుంచి ఆ ముగ్గురు ఔట్!

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను 280 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. అదే జోరులో రెండో టెస్టులోనూ ఘనంగా నెగ్గి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. కాన్ఫూర్ వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి టెస్టు ఫ్రారంభం కానుంది.

అయితే భారత జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లను బీసీసీఐ విడుదుల చేయననున్నట్లు తెలుస్తోంది. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, యశ్ దయాల్‌ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇరానీ ట్రోఫీ ఆడే జట్లలో ఈ ముగ్గురు చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. రంజీ ఛాంపియన్ ముంబై జట్టులో సర్ఫరాజ్ ఉండగా, రెస్టాఫ్ఇండియా జట్టుకు ధ్రువ్, యశ్ దయాల్ ఎంపికయ్యారు.

IND vs BAN Sarfaraz Jurel and Dayal Set to Exit India Squad for Irani Cup

ఇరానీ ట్రోఫీ ఆడే జట్లను ప్రకటించిన బీసీసీఐ ఈ ముగ్గురు గురించి స్పష్టంగా వివరణ ఇచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టెస్టు తుదిజట్టులో ఎంపిక కాకపోతే..ఈ ముగ్గురు ఇరానీ కప్ ఆడతారని పేర్కొంది. అయితే ఈ ముగ్గురు తుదిజట్టులో ఎంపిక కారని సమాచారం. కేఎల్ రాహుల్ మంచి లయలో ఉండటం, రిషభ్ పంత్ తిరిగిరావడంతో సర్పరాజ్, ధ్రువ్ జురెల్‌లకు నిరాశే మిగులుతుంది. తొలి టెస్టు తుదిజట్టులోనూ చోటు దక్కలేదు.

ఇక రెండో టెస్టు వేదిక అయిన కాన్పూర్ పిచ్ స్పిన్‌‌కు కాస్త ఎక్కువగా అనుకూలిస్తుంది. దీంతో భారత్ ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎంపికలో స్టార్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ తొలి ప్రాధాన్యత ఇస్తారు. వీరిద్దరిలో ఒకరికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే ఆకాశ్ దీప్ బ్యాకప్ ఆప్షన్‌గా ఉంటాడు. తొలిసారి టీమిండియాకు ఎంపికైన యశ్ దయాల్‌కు రెండో టెస్టు తుదిజట్టులో చోటు దక్కడం అసాధ్యమే. దీంతో ఈ ముగ్గురుని జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇరానీ ట్రోఫీ టైటిల్‌ పోరు అక్టోబరు 1-5 మధ్య లక్నోలో జరుగుతుంది.

IND vs BAN Sarfaraz Jurel and Dayal Set to Exit India Squad for Irani Cup

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ఎంపికైన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్‌.

Story first published: Wednesday, September 25, 2024, 8:19 [IST]
Other articles published on Sep 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+