Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: రివ్యూలో ఊహించని ఫలితం.. ఎగిరి గంతేసిన రోహిత్ (Video)

కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆటలో లంచ్ విరామానికి 26 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (28 బ్యాటింగ్; 48 బంతుల్లో, 6 ఫోర్లు), మోమినుల్ హక్ (17 బ్యాటింగ్; 48 బంతుల్లో, 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.

బంగ్లాదేశ్ ఓపెనర్లు జకీర్ హసన్ (డకౌట్; 24 బంతుల్లో), షాద్మాన్ ఇస్లామ్ (24; 36 బంతుల్లో, 4 ఫోర్లు) విఫలమయ్యారు. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీశాడు. అయితే బంగ్లా ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా ఆరంభించారు. బుమ్రా, సిరాజ్ తొలి స్పెల్‌ను ఆచితూచి ఆడారు. దీంతో తొమ్మిదో ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ ఆకాశ్ దీప్‌కు బంతిని అందించాడు.

IND vs BAN Rohit Sharma Surprised by Three Reds Akash Deep Praised for Successful Review

తన తొలి ఓవర్‌ మూడో బంతికే ఆకాశ్ దీప్ వికెట్ సాధించాడు. జకీర్‌ను బోల్తా కొట్టించాడు. ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని స్లిప్‌లోకి వెళ్లిన బంతిని జైస్వాల్ అద్భుతంగా ముందకు డైవ్ చేసి క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే కాసేపటికే బంగ్లాదేశ్‌‌ను ఆకాశ్ మరో దెబ్బ తీశాడు. 12వ ఓవర్ తొలి బంతికి మరో ఓపెనర్ షాదాన్ ఇస్లామ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

ఈ వికెట్‌ను భారత్ సమీక్షలో సాధించింది. తొలుత అంపైర్ ఔట్ ఇవ్వలేదు. కచ్చితంగా ఇది ఔట్ అని రివ్యూకు వెళ్లమని కెప్టెన్ రోహిత్‌ను ఆకాశ్ దీప్ కోరాడు. వికెట్ కీపర్ పంత్ అభిప్రాయం తీసుకున్న రోహిత్ సమీక్షకు వెళ్లాడు. కాన్పూర్ పిచ్ తక్కువ బౌన్స్ లభించడంతో ఎత్తు సమస్య లేదు. కానీ తొలి రిప్లైలో బంతి లెగ్ స్టంప్‌ను మిస్ అవుతున్నట్లు కనిపించింది.

అయితే మరో కెమెరా యాంగిల్‌తో రివ్యూని పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్‌గా మారింది. థర్డ్ అంపైర్ ఫలితాన్ని చూసి హిట్ మ్యాన్ ఎంతో ఆశ్చర్యపోయాడు. ఔట్ ఇస్తాడని ఊహించలేదన్నట్లుగా హావాభావాలు పలుకుతూ సహచర ఆటగాళ్లతో కలిసి ఎగిరి గంతేశాడు.

Story first published: Friday, September 27, 2024, 13:01 [IST]
Other articles published on Sep 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+