Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: కోహ్లి కారణం కాదు! అందుకే కోపంతో అరిచాను- రోహిత్ (Video)

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోంది. లీగ్ దశను సునాయాసంగా దాటిన టీమిండియా సూపర్-8లోనూ ఇప్పటి వరకు చెమటోడ్చలేదు. ఆడుతూ పాడుతూ విజయాలు సాధిస్తుంది. మ్యాచ్‌లన్నీ ఆసక్తికరంగా సాగుతున్నప్పటికీ సమవుజ్జీలైన ప్రత్యర్థి ఎదురుకాకపోవడంతో హోరాహోరీ పోరులు జరగలేదు.
అయితే బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తీవ్రతతో సంబరాలు చేసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.

సాధారణంగా కవ్వించే ప్రత్యర్థిపైనే టీమిండియా దూకుడుగా రియాక్ట్ అవుతుంటుంది. లేదా మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రత్యర్థి ప్లేయర్ల వికెట్ పడినప్పుడు ఆవేశంగా సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. కానీ భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ కోపంగా అరుస్తూ ఊగిపోతూ బంగ్లా తొలి వికెట్ సంబరాలు చేసుకున్నాడు. అయితే దానికి కారణం విరాట్ కోహ్లి అని నెట్టింట్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

IND vs BAN Rohit Sharma on Aggressive Celebrations The Thrill of Success with the Bowlers

కోహ్లి ఔట్ చేసిన తర్వాత తన్జీమ్ హసన్ సకీబ్ హద్దులు దాటుతూ సంబరాలు చేసుకున్నాడు. కోహ్లి వైపు ఆవేశంగా చూస్తూ అరుస్తూ అతిగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దానికి రివెంజ్‌గా బంగ్లా తొలి వికెట్ అయిన లిట్టన్ దాస్ ఔటైనప్పుడు రోహిత్ శర్మ అలా చేశాడని పోస్ట్‌లు వచ్చాయి. అయితే దానికి కోహ్లి కోసం రివెంజ్ కాదని మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. తీవ్రతతో సంబరాలు చేసుకోవడానికి ప్రత్యేక కారణం ఉందంటూ రోహిత్ శర్మ వివరించాడు.

లిట్టన్ దాస్ వికెట్ కోసం అంతకుముందే హార్దిక్ పాండ్యతో చర్చించానని, ప్రత్యేక ప్రణాళిక రచించామని, దానికి తగ్గట్లుగా ఫీల్డింగ్ సెట్ చేశామని రోహిత్ చెప్పాడు. ఆ వ్యూహం ఫలించడంతో వచ్చిన ఎగ్జైట్‌మెంట్‌లో కోపం అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నానని హిట్‌మ్యాన్ తెలిపాడు. కాగా, రేపు ఆస్ట్రేలియాతో భారత్ ఆఖరి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. ఆసీస్‌పై గెలిస్తే నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా సెమీఫైనల్స్‌కు చేరుకుంటుంది.

Story first published: Sunday, June 23, 2024, 18:33 [IST]
Other articles published on Jun 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+