టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భారత్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ తలపడనుంది. అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం సాధించి జోరు మీదున్న టీమిండియా బంగ్లాను మట్టికరిపించి సెమీఫైనల్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమిపాలైన బంగ్లాదేశ్.. భారత్‌పై సంచనల విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళూరుతోంది.
పొట్టి ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌దే 12-1తో పైచేయి. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించింది. గత రికార్డులతో, ప్రస్తుత ఫామ్, జట్టు బలాబలాలతో పోలిస్తే భారత్‌కు ఇవాళ పోరులో ఎదురులేదు. కానీ ఆంటిగ్వాలో స్లో పిచ్‌లు కావడంతో బంగ్లాదేశ్‌ను అంత తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. అంతేగాక భారత్‌ను మరో సమస్య వెంటాడుతోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక రోహిత్ శర్మ అయోమయంలో పడ్డాడు.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిసిన ఒక రోజు అనతంరం ఆస్ట్రేలియాతో భారత్ సూపర్-8 మ్యాచ్ ఆడాల్సి ఉంది. దాని కోసం ఆంటిగ్వా నుంచి టీమిండియా సెయింట్ లూసియాకు వెళ్లాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా భారత ఆటగాళ్లు ప్రయాణాలతో అలసిపోతున్నారు. మరోవైపు భారత్ సెమీస్‌కు చేరితే గయానా వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్‌లో ఆడాల్సి ఉంది. సెమీస్ ముగిసిన ఒక్క రోజు వ్యవధిలోనే ఫైనల్ ఉంటుంది.
అయితే వరుస ప్రయాణాలు, మ్యాచ్‌లతో స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాపై పనిభారం పెరుగుతుందని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సాధించిన విజయాల్లో ప్రధాన పాత్ర బుమ్రాదే. ఆస్ట్రేలియాతో సూపర్-8 పోరు, సెమీఫైనల్, ఫైనల్లో బుమ్రా జట్టుకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌లో ఉన్నారు.
మరోవైపు బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కొనసాగించి ఆస్ట్రేలియా పోరులో బుమ్రాకు రెస్ట్ ఇచ్చే యోచనలోనూ ఉన్నారు. బంగ్లా మ్యాచ్‌లో ఘన విజయం సాధిస్తే భారత్ సెమీస్ బెర్త్ దాదాపు ఖాయమవుతుంది. దీంతో ఆస్ట్రేలియా పోరు కీలకంగా మారదు. దీంతో ఆసీస్ మ్యాచ్‌కు బుమ్రా విశ్రాంతి ఇద్దామనే ప్లాన్-బీలోనూ రోహిత్ ఉన్నాడు. మరికొన్ని గంటల్లో ఈ విషయంపై స్పష్టత రానుంది.