Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: రోహిత్ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన బంగ్లాదేశ్ (Video)

కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. కష్టమైన క్యాచ్‌ను రోహిత్ అందుకున్న తీరును చూసి బంగ్లాదేశ్ బ్యాటర్లతో సహా టీమిండియా ఆటగాళ్లు సైతం నోరెళ్లబెట్టారు. శుభ్‌మన్ గిల్ తన చేతులను తలపై పెట్టుకుని ఆశ్చర్యపోయి చేసిన సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

కాస్త ఆలస్యంగా బంతిని అందుకున్న సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్, రోహిత్ హైక్లాస్ ఫీల్డింగ్ తోడవ్వడంతో కుదుకున్నట్లుగా కనిపించిన లిటన్ దాస్ (13; 30 బంతుల్లో, 3 ఫోర్లు) పెవిలియన్‌కు చేరాడు. సిరాజ్ వేసిన బంతిని ముందుకు వచ్చి లిటన్ దాస్ షాట్‌కు యత్నించాడు. తన తల మీదుగా వెళ్తున్న బంతిని మిడాఫ్‌లో ఉన్న రోహిత్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు.

IND vs BAN Rohit Sharma s Brilliant One-Handed Catch Removes Litton Das in Spectacular Fashion

కాగా, ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైన ఆటలో టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నారు. బంగ్లాదేశ్‌ను వీలైనంత త్వరగా ఆలౌట్ చేసేలా ప్రయత్నిస్తున్నారు. 61 ఓవర్లకు బంగ్లాదేశ్ ప్రస్తుతం ఆరు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. క్రీజులో మోమినుల్ హక్ (86 బ్యాటింగ్), మెహది హసన్ మిరాజ్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇవాళ ఆటలో ముష్ఫికర్ రహీమ్ (11), లిటన్ దాస్ (13), షకిబ్ అల్ హసన్ (9) ఎక్కువసేపు క్రీజలో నిలవలేకపోయారు.

టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు, సిరాజ్, బుమ్రా తలో వికెట్ తీశారు. షకిబ్‌ను అశ్విన్, ముష్ఫికర్ బుమ్రా పెవిలియన్‌కు చేర్చారు. కాగా, వరుణుడు ప్రతాపం చూపించడంతో తొలి రోజు 35 ఓవర్లు పాటే ఆట కొనసాగిన విషయం తెలిసిందే. రెండో రోజు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండా రద్దు అయ్యింది. అయితే ఇవాళ 98 ఓవర్ల పాటు ఆట కొనసాగించనున్నారు.

ఈ నేపథ్యంలో సెషన్ల టైమింగ్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి 11.45 వరకు తొలి సెషన్ జరగనుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 12.25 నుంచి 2.40 వరకు, ఆఖరి సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

Story first published: Monday, September 30, 2024, 11:45 [IST]
Other articles published on Sep 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+