సుదీర్ఘ విరామం అనంతరం టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ సత్తాచాటాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన జట్టును..పంత్ తనదైన శైలిలో చెలరేగుతూ ఆదుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన జాబితాలో చోటు కూడా సంపాదించాడు.
2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదం అనంతరం రిషభ్ పంత్ ఆటకు దాదాపు 15 నెలలు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో సత్తాచాటి టీ20 వరల్డ్ కప్‌తో టీమిండియాలో పురాగనమం చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో హిట్ అయిన పంత్ శ్రీలంక పర్యటనతో వన్డే ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ పునరాగమనంలో సత్తాచాటుతున్నాడు. రోడ్డు ప్రమాదానికి ముందు బంగ్లాదేశ్‌తోనే పంత్ చివరి టెస్టు ఆడాడు. యాదృచ్ఛికంగా బంగ్లా మ్యాచ్‌తోనే 632 రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.

అయితే తొలి టెస్టు ఆరంభంలో భారత్‌పై ఆధిపత్యం చెలాయించంది. పాకిస్థాన్‌ను వాళ్ల సొంతగడ్డపై వైట్ వాష్ చేసిన కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా పది ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోయింది. హసన్ మహ్మద్ నిప్పులు చెరిగే బంతులకు కెప్టెన్ రోహిత్ శర్మ (6; 19 బంతుల్లో, 1 ఫోర్), శుభ్‌మన్ గిల్ (డకౌట్), విరాట్ కోహ్లి (6; 6 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌కు చేరారు.
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ (39; 52 బంతుల్లో, 6 ఫోర్లు).. జైస్వాల్ (37 నాటౌట్; 62 బంతుల్లో, 6 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో జైస్వాల్‌తో అర్ధశతక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీంతో లంచ్ విరామానికి భారత్ మరో వికెట్ కోల్పోకుండా పుంజుకుంది. 23 ఓవర్లకు 88/3 స్కోరుతో మొదటి సెషన్ ముగించింది. అయితే దూకుడుగా ఆడుతూ స్ట్రైక్‌రేటు మెరుగుపర్చుకున్న పంత్ అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు.
21వ శతాబ్దంలో, టెస్టుల్లో కనీసం 2000 పరుగులు సాధించిన ఆటగాళ్లలో అత్యధిక స్ట్రైక్‌రేటు కలిగిన ప్లేయర్ల జాబితాలో రిషభ్ పంత్ నాలుగో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో టిమ్ సౌథి (143 టెస్టులు, 2098 పరుగులు, 83 స్ట్రైక్‌రేటు), వీరేంద్ర సెహ్వాగ్ (180 టెస్టులు, 8586 పరుగులు, 82.2 స్ట్రైక్‌రేటు), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (129 టెస్టులు, 5130 పరుగులు, 82 స్ట్రైక్‌రేటు), రిషభ్ పంత్ (57 టెస్టులు, 2298 పరుగులు, 73.6 స్ట్రైక్‌రేటు), క్వింటన్ డికాక్ (91 టెస్టులు, 3300 పరుగులు, 70.9 స్ట్రైక్‌రేటు) ఉన్నారు.
RISHABH PANT IS BACK IN TEST CRICKET...!!!!🔥
— Tanuj Singh (@ImTanujSingh) September 19, 2024
- Vintage Pant is here in Test Cricket for India. 🌟pic.twitter.com/HoiZCGudMZ