బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసిన భారత్ టీ20 సిరీస్‌నూ 3-0తో వైట్‌వాష్ చేసింది. ఉప్పల్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 297 పరుగులు చేసింది. సంజు శాంసన్ (111; 47 బంతుల్లో, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించాడు.
సూర్యకుమార్ యాదవ్ (75; 35 బంతుల్లో, 8 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్య (47; 18 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (34; 13 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. బంగ్లా బౌలర్లలో తంజీమ్ హసన్ షకిబ్ మూడు వికెట్లు, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 164 పరుగులకే పరిమితమైంది.

తౌహిద్ హృదోయ్(63 నాటౌట్; 42 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), లిటన్ దాస్ (42; 25 బంతుల్లో, 8 ఫోర్లు) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు, మయాంక్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు. అయితే ఈ క్రమంలో రవి బిష్ణోయ్ అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.
ఈ క్రమంలో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున 50 వికెట్లు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రవి బిష్ణోయ్ రికార్డులకెక్కాడు. 24 ఏళ్ల 37 రోజుల వయస్సులో ఈ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు అర్షదీప్ సింగ్ పేరిట ఉంది. అర్షదీప్ 24 ఏళ్ల 196 రోజుల వయస్సులో 50 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.
అంతేగాక 50 వికెట్ల మార్క్‌ను మ్యాచ్‌ల పరంగా వేగంగా అందుకున్న మూడో బౌలర్‌గా రవి బిష్ణోయ్ రికార్డులకెక్కాడు. బిష్ణోయ్ 33 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో కుల్‌దీప్ యాదవ్ (30), అర్షదీప్ సింగ్ (33) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.