Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: ఆ ఇద్దరిపై వేటు?.. బంగ్లాదేశ్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే!

India Playing XI: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్ పాకిస్థాన్ జట్టును సూపర్-4 మ్యాచ్‌లో చిత్తుగా ఓడించింది. ఇప్పుడు ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవడానికి రేపు(సెప్టెంబర్ 24) బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ బలహీనమైన జట్టు కావడం, గత మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాటర్లు కొంత ఇబ్బంది పడటంతో ఈ మార్పులు అనివార్యం కానున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎలా ఉండబోతోందో చూద్దాం.

ఆ ఇద్దరికీ చోటు గల్లంతు?
బంగ్లాదేశ్‌‌తో జరిగే మ్యాచ్‌లో అంత పెద్దగా భారీ మార్పులు ఉండకపోవచ్చు. అయితే కొన్ని వ్యూహాత్మక మార్పులు భారత్‌కు మేలు చేయవచ్చు. గత మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన 3 మ్యాచ్‌లలో 11 ఓవర్లలో 92 పరుగులు ఇచ్చి కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. కాబట్టి బుమ్రా స్థానంలో టీమిండియా నంబర్ వన్ టీ20 బౌలర్ అయిన్ అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం లభించవచ్చు. అలాగే వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ బ్యాటింగ్‌లో ఇబ్బందులు పడుతున్నాడు. పాకిస్తాన్‌పై 17 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ స్థానంలో జితేష్ శర్మకు అవకాశం ఇవ్వొచ్చు.

IND vs BAN Playing 11 Team India Likely to Make 2 Changes for Bangladesh Match

బంగ్లాదేశ్‌పై భారత్ తుది జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ / జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా / అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Tuesday, September 23, 2025, 13:00 [IST]
Other articles published on Sep 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+