For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంక్రెడిబుల్ కేఎల్ రాహుల్ - అదేం థ్రో రా భయ్..!!

IND vs BAN: Netizens lauds KL Rahul for his Incredible direct throw for Litton Das run-out

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు ఇవ్వాళ మరో కీలక మ్యాచ్ ఆడుతోంది. అడిలైడ్‌ ఓవల్‌లో బంగ్లాదేశ్‌తో తలపడబోతోంది. పైచేయి సాధించేలా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి మిగిల్చిన పరాభవాన్ని బంగ్లాపై తీర్చుకుంటోంది టీమిండియా. తొలుత బ్యాటింగ్‌లో, అనంతరం బౌలింగ్‌లో దమ్ము దులుపుతోంది. మెరుపు ఫీల్డింగ్- దీనికి అదనం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే- సెమీ ఫైనల్స్ బెర్త్‌ను భారత్ కన్‌ఫర్మ్ చేసుకున్నట్టే.

వర్షం అంతరాయాన్ని కలిగించిన ఈ మ్యాచ్‌లో.. రోహిత్ సేన ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా తడపడుతోంది. వెంటవెంటనే ఆరు వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు అద్దిరిపోయే ఆరంభాన్ని అందించినప్పటికీ- దాన్ని కాపాడుకోలేకపోతోన్నారు మిగిలిన బ్యాటర్లు. టీమిండియా పేస్ బౌలింగ్ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్ లిట్టన్ దాస్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 27 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 60, మరో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 21 పరుగులు చేశారు.

ఆ తరువాత వచ్చిన టాప్ ఆర్డర్ బ్యాటర్లెవరూ కుదురుగా క్రీజ్‌లో నిల్చోలేదు. కేప్టెన్ షకీబుల్ హసన్ 13 పరుగులకే వెనుదిరిగాడు. అఫీఫ్ హొస్సేన్-3, యాసిర్ అలీ-1, మొసాద్దెక్ హొస్సేన్-6 పరుగులకే పెవిలియన్ చేరారు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు కూల్చాడు. హార్దిక్ పాండ్యా, షమీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం వికెట్ కీపర్ నూరుల్ హసన్-10, తస్కిన్ అహ్మద్-0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

IND vs BAN: Netizens lauds KL Rahul for his Incredible direct throw for Litton Das run-out

ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ విసిరిన థ్రో.. హైలైట్. జోరు మీదున్న లిట్టన్ దాస్‌ను కేఎల్ రాహుల్ రనౌట్ చేసిన తీరు అద్భుతం. అతను సంధించిన డైరెక్ట్ థ్రోకు లిట్టన్ బలి అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ సంధించిన ఎనిమిదో ఓవర్ రెండో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడాడు లిట్టన్. రెండో రన్ కోసం నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచి క్రీజ్‌కు చేరుకునే లోపే కేఎల్ రాహుల్ సంధించిన డైరెక్ట్ థ్రో- వికెట్లను గిరాటేసింది. రనౌట్ నుంచి కాపాడుకోవడానికి లిట్టన్ డైవ్ కొట్టినా ఉపయోగం లేకుండా పోయింది.

మొన్నటి వరకూ తీవ్రంగా విమర్శలను ఎదుర్కొన్న కేఎల్ రాహుల్‌కు ఊపిరి పోసిందీ మ్యాచ్. తొలుత బ్యాటింగ్‌లో.. అనంతరం మెరుపు ఫీల్డింగ్‌తో కట్టిపడేశాడీ కన్నడిగుడు. 32 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో సరిగ్గా హాఫ్ సెంచరీ చేశాడు. ఇదివరకు పాకిస్తాన్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాపై పరుగుల కోసం చెమటోడ్చాల్సి వచ్చిందతనికి. పట్టుమని 10 పరుగులు చేయలేకపోయాడు. దీనితో అతను తీవ్ర విమర్శలకు గురయ్యాడు. బంగ్లాపై మ్యాచ్‌లో వాటన్నింటినీ తుడిచిపెట్టేశాడు.

Story first published: Wednesday, November 2, 2022, 17:49 [IST]
Other articles published on Nov 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+