IND vs BAN: చరిత్ర సృష్టించిన బుమ్రా
చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన భారత ఆరో ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా చరిత్రకెక్కాడు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో కనీసం 400 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో అత్యల్ప సగటును కలిగిన రెండో ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో బుమ్రా 21.01 సగటుతో 400 వికెట్లు పడగొట్టాడు. అగ్రస్థానంలో వెస్టిండీస్ పేసర్ జోయెల్ గార్నెర్ ఉన్నాడు. అతను 20.20 సగటుతో వికెట్లు పడగొట్టాడు. ఇక 30 ఏళ్ల బుమ్రా టెస్టుల్లో 170 వికెట్లు, వన్డేల్లో 149, టీ20 ఫార్మాట్‌లో 89 వికెట్లు తీశాడు. భారత్‌లో ఆడిన తొమ్మిది టెస్టుల్లో బుమ్రా 15.94 సగటుతో ఏకంగా 37 వికెట్లు సాధించాడు.

బుమ్రా కంటే ముందు 400 వికెట్ల ఘనతను భారత్ తరఫున తొమ్మిది బౌలర్లు అందుకున్నారు. అనిల్ కుంబ్లే (953 వికెట్లు, 499 ఇన్నింగ్స్‌ల్లో), రవిచంద్రన్ అశ్విన్ (744 వికెట్లు, 369 ఇన్నింగ్స్‌ల్లో), హర్భజన్ సింగ్ (707 వికెట్లు, 442 ఇన్నింగ్స్‌ల్లో), కపిల్ దేవ్ (687 వికెట్లు, 448 ఇన్నింగ్స్‌ల్లో), జహీర్ ఖాన్ (597 వికెట్లు, 373 ఇన్నింగ్స్‌ల్లో), రవీంద్ర జడేజా (570 వికెట్లు, 397 ఇన్నింగ్స్‌ల్లో), శ్రీనాథ్ (551 వికెట్లు, 348 ఇన్నింగ్స్‌ల్లో), మహ్మద్ షమి (448 వికెట్లు, 245 ఇన్నింగ్స్‌ల్లో), ఇషాంత్ శర్మ (434 వికెట్లు, 280 ఇన్నింగ్స్‌ల్లో), బుమ్రా (401 వికెట్లు, 227 ఇన్నింగ్స్‌ల్లో) ఈ ఘనత సాధించారు.
కాగా, బుమ్రా ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. షకిబ్ అల్ హసన్ (32; 64 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోరర్. మెహది హసన్ మిరాజ్ (27; 52 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), నజ్ముల్ హొస్సేన్ షాంటో (20; 30 బంతుల్లో, 3 ఫోర్లు) పరుగులు చేశారు. బుమ్రా నాలుగు వికెట్లు, ఆకాశ్ దీప్, సిరాజ్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications