Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: ఆ బంగ్లాదేశ్ కుర్రాడితో తలనొప్పే!

దాదాపు నెలన్నర రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా తిరిగి బరిలోకి దిగుతోంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా చివరి టెస్టు జరగనుంది.

ఈ సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసి వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. స్వదేశంలో టీమిండియాను ఓడించాలంటే బలమైన జట్లకే అంత సులువు కాదు. ఇక బంగ్లాదేశ్‌తో సిరీస్ అంటే రోహిత్ సేనదే పైచేయి అవ్వడం దాదాపు ఖాయమే. కానీ ఈసారి బంగ్లా అంత తేలికగా కనిపించట్లేదు.

IND vs BAN India s Strategy to Counter Bangladesh s 6 5 Fast-Bowling Sensation Nahid Rana

ఇటీవల పాకిస్థాన్‌ను ఓడించి బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. పాక్‌పై చారిత్ర విజయం సాధించిన ఉత్సాహంతో భారత్‌తో సిరీస్‌కు సిద్ధమవుతోంది. అయితే బంగ్లా జట్టులో ఓ యువ పేసర్.. భారత బ్యాటర్లకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఈ 21 ఏళ్ల కుర్రాడు మూడు టెస్టులకు స్టార్ ఫాస్ట్ బౌలర్‌గా పాపులర్ అయ్యాడు. అతనే నహిద్ రాణా.

పాక్‌తో జరిగిన రెండు టెస్టులో జట్టు విజయంలో నహిద్ రాణాది కీలక పాత్ర. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. బాబర్ అజామ్, షాన్ మసూద్, సాద్ షకీల్ వంటి ప్రధాన బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చాడు. 140+ కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు విసురుతున్నాడు. అంతేగాక 150 కి.మీ వేగంతో బుల్లెట్‌లా బంతులు సంధిస్తున్నాడు. అతని బౌలింగ్‌కు తన ఎత్తు మరో బలంగా మారింది. ఈ కుర్రాడు 6.2 అడుగుల ఎత్తు.

2020లో క్రికెట్‌ను ఆరంభించిన నహిద్ నాలుగేళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నహిద్‌ రాణా మూడు టెస్టుల్లో 11 వికెట్లు పడగొట్టాడు. 18 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 74 వికెట్లు, 10 లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో 26 వికెట్లు సాధించాడు. అందుకే ఈ టాలెంటెడ్ కుర్రాడు నహిద్ రాణాను ఎదుర్కోవడానికి టీమిండియా ప్రణాళికలు మొదలుపెట్టింది. నెట్స్‌లో ఆరున్నర అడుగుల పంజాబీ పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌‌తో భారత బ్యాటర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

Story first published: Sunday, September 15, 2024, 10:33 [IST]
Other articles published on Sep 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+