బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కాన్పూర్ టెస్టును డ్రా ముగించకుండా ఫలితం కోసం శ్రమిస్తున్న భారత్.. క్రికెట్ చరిత్రలో కనీవిని ఎరుగుని రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్ హిస్టరీలో మూడు ఓవర్లలోపే 50 పరుగుల స్కోరును అందుకున్న ఏకైక జట్టుగా టీమిండియా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ విధ్వంసంతో ఈ రికార్డు సాధ్యమైంది. టీ20 తరహా బ్యాటింగ్‌తో నయా చరిత్ర నమోదైంది. అంతేగాక ఫాస్టెస్ 100 రన్స్ చేసిన జట్టుగా తన పేరిట ఉన్న రికార్డును టీమిండియా తిరగరాసింది.
రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (107 నాటౌట్; 194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ శతకంతో సత్తాచాటాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (31; 57 బంతుల్లో, 6 ఫోర్లు) రెండో టాప్ స్కోరర్. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లతో చెలరేగాడు. మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ పడగొట్టాడు.

వరుణుడు ప్రతాపంతో తొలి రోజు 35 ఓవర్లు మాత్రే ఆట, రెండో రోజు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండా రద్దు అవ్వడంతో.. ఓవర్‌నైట్ స్కోరు 107/3తో ఇవాళ ఆట ఆరంభించిన బంగ్లాదేశ్ మరో 126 పరుగులు చేసి చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే కేవలం రెండో టెస్టులో నాలుగు సెషన్‌లే మిగిలి ఉండటంతో టీమిండియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది.
హసన్ మహ్మద్ వేసిన తొలి ఓవర్‌లో జైస్వాల్ హ్యాట్రిక్ బౌండరీలతో 12 పరుగులు సాధించాడు. ఇక రెండో ఓవర్‌లో స్ట్రైకింగ్ అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఖలీద్ అహ్మద్ వేసిన తొలి రెండు బంతుల్ని భారీ సిక్సర్లుగా మలిచాడు. దీంతో బౌలర్ భయపడి లైగ్ సైడ్ అవతలకు బంతిని విసిరి బై ఇవ్వడంతో జైస్వాల్ క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్‌లో జైస్వాల్ కూడా ఓ బౌండరీ సాధించడంతో 17 పరుగులు వచ్చాయి. ఇక మూడో ఓవర్‌లో రోహిత్-జైస్వాల్ కలిసి 22 పరుగులు పిండుకున్నారు. దాంతో 3 ఓవర్లకు భారత్ 51/0 రికార్డు స్కోరు సాధించింది.
హసన్ మహ్మద్ వేసిన మూడో ఓవర్‌లో రోహిత్ ఓ సిక్సర్ సాధించగా, జైస్వాల్ ఓ సిక్సర్, రెండు బౌండరీలు బాదాడు. దాంతో టెస్టుల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 50 పరుగులు సాధించిన జట్టుగా భారత్ నయా చరిత్ర లిఖించింది. కాగా, దూకుడుగా ఆడే ప్రయత్నంలో మెహదీ హసన్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ (23; 11 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) ఔటయ్యాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది. ఇంగ్లండ్ 26 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకుంది.
జైస్వాల్ దూకుడు కొనసాగించడంతో టీమిండియా 10.1 ఓవర్లలోపే 100 పరుగుల మార్క్‌ను తాకింది. టెస్టుల్లో బంతుల పరంగా ఓ జట్టు వేగంగా 100 పరుగులు చేయడం ఇదే. అంతకుముందు ఈ రికార్డు భారత్ పేరిటే ఉంది. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 12.2 ఓవర్లలో టీమిండియా మూడంకెల స్కోరు సాధించింది.