Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: హార్దిక్ ఊరమాస్ బ్యాటింగ్.. బెస్ట్ యాటిట్యూడ్ షాట్! (Video)

టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ టీ20 సిరీస్‌నూ ఘనంగా బోణీ కొట్టింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 128 పరుగుల లక్ష్యాన్ని 12 ఓవర్లలోపే ఛేదించి మ్యాచ్‌ను రికార్డు వేగంతో ముగించింది. టీ20ల్లో 100+ లక్ష్యాన్ని భారత్ అతిత్వరగా ముగించిన మ్యాచ్ ఇదే.

మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. మెహ్‌దీ హసన్ మీరాజ్(35 నాటౌట్; 32 బంతుల్లో, 3 ఫోర్లు), నజ్ముల్ హెస్సేన్ షాంటో(27; 25 బంతుల్లో, ఫోర్, సిక్సర్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (3/31), అర్ష్‌దీప్ సింగ్(3/14) చెరో మూడు వికెట్లు, మయాంక్ యాదవ్(1/21), హార్దిక్ పాండ్య(1/26), వాషింగ్టన్ సుందర్(1/12)తలో వికెట్ తీశారు.

IND vs BAN Hardik Pandya Stuns with No-Look Ramp Shot Over the Keeper

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి గెలుపొందింది. హార్దిక్ పాండ్య (39 నాటౌట్; 16 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (29; 14 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజు శాంసన్(29; 19 బంతుల్లో, 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీ హసన్ మీరాజ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లు తలో వికెట్ తీశారు.

అయితే ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ఆడిన ఓ షాట్ నెట్టింటిని షేక్ చేస్తోంది. తన షాట్ ప్లేస్‌మెంట్‌పై నమ్మకంతో హార్దిక్ ఆడిన యాటిట్యూడ్ షాట్ నెట్టింట వైరల్‌గా మారింది. 12వ ఓవర్‌లో తస్కిన్ అహ్మద్ వేసిన మూడో బంతిని హార్దిక్ వికెట్ కీపర్ మీదుగా బౌండరీ బాదాడు. అయితే ఆ షాట్ ఆడిన తర్వాత హార్దిక్ బంతివైపు చూడలేదు. బౌలర్ కళ్లలో మాత్రమే చూశాడు. తన షాట్‌పై నమ్మకంతో బౌండరీకి వెళ్తుందని కనీసం సింగిల్‌కు కూడా హార్దిక్ ప్రయత్నించలేదు.

హార్దిక్ స్వాగ్‌కు సంబంధించిన ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ఇక అదే ఓవర్‌లో సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించిన హార్దిక్ పాండ్య అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున సిక్సర్‌తో అత్యధిక మ్యాచ్‌లను ముగించిన ప్లేయర్‌గా హార్దిక్ చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌తో కలిపి హార్దిక్ అయిదు సార్లు సిక్సర్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.

Story first published: Monday, October 7, 2024, 11:21 [IST]
Other articles published on Oct 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+