Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: ఇది నాకో పునర్జన్మ..అతని సాయం గొప్పది: వరుణ్ చక్రవర్తి

దాదాపు మూడేళ్ల తర్వాత టీమిండియాలో తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. 2021 టీ20 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌తో మ్యాచ్ అనంతరం భారత జట్టుకు వరుణ్ ఎంపికకాలేదు. కానీ ఐపీఎల్‌, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సత్తాచాటి తిరిగి సెలక్టర్లను ఆకర్షించాడు. 86 మ్యాచ్‌ల అనంతరం తిరిగి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.

రీఎంట్రీలో వరుణ్ సత్తాచాటాడు. బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లతో చెలరేగాడు. నాలుగో వికెట్ కూడా తన ఖాతాలో పడేదే. కానీ ఫీల్డర్‌ను క్యాచ్‌ను అందుకోలేకపోవడంతో మూడు వికెట్లతో సరిపెట్టుకున్నాడు. అయితే ఈ మూడేళ్లలో తన స్పిన్ బౌలింగ్‌లో టెక్నిక్‌ను మార్చుకున్నానని వరుణ్ చక్రవర్తి చెప్పాడు. సైడ్ స్పిన్ నుంచి ఓవర్ స్పిన్‌కు మార్చుకున్నానని పేర్కొన్నాడు.

IND vs BAN From Side-Spin to Over-Spin It Took Me Two Years Varun Chakaravarthy on Mastering His Mystery Spin

అలాగే ఆత్మవిశ్వాసంతో తిరిగి అంతర్జాతీయ వేదికపై పోటీపడేలా సిద్ధమవ్వడంలో రవిచంద్రన్ అశ్విన్ తనకు సాయం చేశాడని వరుణ్ చక్రవర్తి తెలిపాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో వరుణ్, అశ్విన్ కలిసి దిండిగల్ డ్రాగన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ రీఎంట్రీ తనకు పునర్జన్మలా ఉందని వరుణ్ పేర్కొన్నాడు.

''మూడేళ్ల తర్వాత తిరిగొచ్చాను. ఇది నాకెంతో భావోద్వేగమైనది. తిరిగి బ్లూజెర్సీ ధరించడం సంతోషంగా ఉంది. ఇది నాకు పునర్జన్మ లాంటిది. గతంలో సైడ్ స్పిన్ బౌలర్‌గా ఉండేవాడిని. ఇప్పుడు ఓవర్ స్పిన్ బౌలర్‌‌గా మారాను. స్పిన్ బౌలింగ్‌లో ఇది అతిచిన్న సాంకేతిక అంశం. ఇలా మార్చుకోడానికి రెండేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టింది''

''తమిళనాడు ప్రీమియర్ లీగ్ అత్యున్నత ప్రమాణాలతో కొనసాగే మంచి టోర్నమెంట్. అక్కడ అశ్విన్ అన్నతో కలిసి తీవ్రంగా శ్రమించా. మేం అక్కడ ఛాంపియన్లుగా నిలిచాం. అది నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ టోర్నీ కొన్ని నెలలు ముందే ఆడాను. బంగ్లాదేశ్ సిరీస్‌కు నాకు అది మంచి సాధన'' అని వరుణ్ చక్రవర్తి అన్నాడు. కాగా, గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Story first published: Monday, October 7, 2024, 13:30 [IST]
Other articles published on Oct 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+