For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND Vs BAN, Day-Night Test: పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా సాధించిన రికార్డులివే!

IND Vs BAN, Day-Night Test: Relentless India Thrash Bangladesh To Create History - Check All The Records

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన చారిత్రాత్మక డే-నైట్ టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగులతో విజయం సాధించి టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డుని నమోదు చేసింది. ఐదు రోజుల పాటు జరగాల్సిన మ్యాచ్‍‌ని కోహ్లీసేన కేవలం మూడు రోజుల్లోనే ముగించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.

ఈ క్రమంలో టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 152/6 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ 195 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ ఐదు, ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టారు.

2-0తో సిరిస్ వైట్ వాష్

2-0తో సిరిస్ వైట్ వాష్

ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో వైట్‌వాష్‌ చేసింది. అంతకముందు ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 360 పాయింట్లకు చేరింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు వరుసగా ఇది 7వ టెస్టు విజయం.

ధోని రికార్డు బద్దలు

ధోని రికార్డు బద్దలు

ఈ ఏడాది ఆగస్టులో వెస్టిండిస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో నెగ్గిన టీమిండియా... ఆ తర్వాత సఫారీలతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో, ప్రస్తుతం బంగ్లాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా ధోని రికార్డు 6 టెస్టు మ్యాచ్‌ల రికార్డుని కోహ్లీ అధిగమించాడు. ధోని నాయకత్వంలో టీమిండియా 2013(ఫిబ్రవరి-నవంబర్)లో వరుసగా 6 టెస్టు మ్యాచ్‌లు నెగ్గింది. ఇప్పుడు ఆ రికార్డుని కోహ్లీ అధిగమించాడు.

టీమిండియా నాలుగు ఇన్నింగ్స్ విజయాలను ఒక్కసారి పరిశీలిస్తే...

టీమిండియా నాలుగు ఇన్నింగ్స్ విజయాలను ఒక్కసారి పరిశీలిస్తే...

1. Defeated South Africa by innings & 137 runs at Pune

2. Defeated SA by innings & 202 runs at Ranchi

3. Defeated Bangladesh by innings & 130 runs at Indore

4. Defeated Bangladesh by innings & 46 runs at Kolkata

టీమిండియా పేస్ బౌలింగ్ దళం అద్భుతం

టీమిండియా పేస్ బౌలింగ్ దళం అద్భుతం

ప్రస్తుతం భారత జట్టు పేస్ బౌలింగ్ దళం అద్భుతంగా ఉంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా పేసర్లు మొత్తం 19 వికెట్లు పడగొట్టడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాడు మహ్మదుల్లా రిటైర్డ్‌ ఔట్‌గా వెళ్లిపోవడంతో పేసర్ల ఖాతాలో 19 వికెట్లే చేరాయి. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో ఇషాంత్‌ శర్మ మొత్తం 9 వికెట్లు సాధించగా, ఉమేశ్‌ యాదవ్‌ 8 వికెట్లు దక్కించుకున్నాడు. మహ్మద్‌ షమీకి రెండు వికెట్లు లభించాయి. దీంతో స్పిన్నర్ల ఖాతాలో వికెటే లేకుండా పోయింది.

సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా పేసర్ల అత్యుత్తమ ప్రదర్శనలు ఇవే:

సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా పేసర్ల అత్యుత్తమ ప్రదర్శనలు ఇవే:

1. 19 against Bangladesh at Kolkata in 2019/20

2. 17 against Sri Lanka at Kolkata in 2017/18

3. 16 against England at Chennai in 1933/34

4. 16 against Pakistan at Delhi in 1979/80

5. 16 against Pakistan at Kolkata in 1998/99

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

తాజా విజయంతో విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించడంతో అత్యధిక టెస్టు విజయాలు సాధించి కెప్టెన్ల జాబితాలో కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌ మాజీ కెప్టెన్ అలెన్‌ బోర్డర్‌ రికార్డును కోహ్లీ బద్దలు చేశాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకిది 33వ టెస్టు విజయం. ఈ జాబితాలో గ్రేమ్‌ స్మిత్‌(53 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా, రికీ పాంటింగ్‌(48 విజయాలు) రెండో స్థానంలో ఉన్నాడు. స్టీవ్‌ వా 41 విజయాలతో మూడో స్థానంలో ఉండగా, వెస్టిండీస్‌ మాజీ సారథి క్లైవ్‌ లాయిడ్‌ 36 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

టెస్టుల్లో టాప్-4 భారత కెప్టెన్ల సక్సెస్ రేట్

టెస్టుల్లో టాప్-4 భారత కెప్టెన్ల సక్సెస్ రేట్

1. Virat Kohli - 53 Matches (Won 33, Lost 10, Win % 62.26)

2. MS Dhoni - 60 Matches (Won 27, Lost 18, Win % 45.00)

3. Sourav Ganguly - 49 Matches (Won 21, Lost 13, Win % 42.85)

4. M Azharuddin - 47 Matches (Won 14, Lost 14, Win % 29.78)

Story first published: Monday, November 25, 2019, 12:39 [IST]
Other articles published on Nov 25, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+