Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN 2nd Test: మైదానాన్ని వీడిన భారత జట్టు (Video)

కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు తొలి సెషన్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కాస్త ఆలస్యమైనా కొన్ని ఓవర్ల అయినా తొలి సెషన్‌లో ఆట కొనసాగుతుందనకుంటే అభిమానులకు నిరాశే మిగిలింది. మరోవైపు ఆట ప్రారంభంకావడానికి ఆలస్యం అవుతుందని గ్రహించిన భారత జట్టు మైదానాన్నివిడిచి హోటల్‌కు చేరుకుంది.

శనివారం ఉదయం 11 గంటలకు వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే సిబ్బంది కవర్లు తీసేలోపే మరోసారి వరుణుడు రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇవాళ ఆటలో తొలి సెషన్ పూర్తిగా రద్దయింది. కాగా, వరుణుడు ప్రభావంతో తొలి రోజు ఆటలో కేవలం 35 ఓవర్లు మాత్రమే జరిగిన విషయం తెలిసిందే. రెండో రోజు అయినా ఆట సజావుగా సాగుతుందనుకుంటే వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపిస్తున్నాడు.

IND vs BAN Day 2 Updates Team India Returns to Hotel as Rain Delays Play in Kanpur

శుక్రవారం ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ 35 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (6), మోమినుల్ హక్ (40) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా తొలి రోజు ఆట గంట ఆలస్యంగా మారింది. అయితే వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో లంచ్ విరామ సమయానికి ముందే ఆటగాళ్లు మైదానాన్ని వీడారు.

రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే వర్షం పడటంతో అంపైర్లు తొలి రోజు ఆట ముగిసిందని ప్రకటించారు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. యువ పేసర్ ఆకాశ్ దీప్ బంగ్లాదేశ్ ఓపెనర్ జకీర్ హసన్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 24 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండా జకీర్ పెవిలియన్ చేరాడు. సెకండ్ స్లిప్ యశస్వి జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు.

కాసేపటికే మరో ఓపెనర్ షెడ్‌మన్ ఇస్లామ్(24)ను కూడా ఆకాశ్ దీప్ ఔట్ చేశాడు.వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (27) బౌండరీలతో జోరు కనబర్చాడు. అయితే క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేసిన అతన్ని అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. దాంతో బంగ్లాదేశ్ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ముష్పికర్ రహీమ్‌తో మోమినల్ హక్ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు.

Story first published: Saturday, September 28, 2024, 12:05 [IST]
Other articles published on Sep 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+