Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాట్ ఓకే - టీమిండియాను హెచ్చరించిన సురేష్ రైనా ..!!

IND vs BAN: close victory over Bangladesh was a wake-up call for Team India, says Suresh Raina

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు మరో ఘన విజయాన్ని అందుకుంది.. అడిలైడ్‌ ఓవల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. డక్ వర్త్ లూయిస్ విధానంలో అయిదు పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి మిగిల్చిన పరాభవాన్ని బంగ్లాపై తీర్చుకుంది టీమిండియా. తొలుత బ్యాటింగ్‌లో, అనంతరం బౌలింగ్‌లో దమ్ము దులిపింది. ప్లేయర్ల మెరుపు ఫీల్డింగ్- దీనికి బోనస్. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా గ్రూప్ 2లో టేబుల్ టాపర్‌గా నిలిచింది.

ఓవర్లు కుదింపు..

ఓవర్లు కుదింపు..

వర్షం అంతరాయాన్ని కలిగించిన ఈ మ్యాచ్‌లో.. రోహిత్ సేన ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా తడపడింది. వెంటవెంటనే ఆరు వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు అద్దిరిపోయే ఆరంభాన్ని అందించినప్పటికీ- దాన్ని కాపాడుకోలేకపోయారు మిగిలిన బ్యాటర్లు. టీమిండియా పేస్ బౌలింగ్ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్ లిట్టన్ దాస్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 27 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 60, మరో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 21 పరుగులు చేశారు.

 వరుసగా వికెట్లు..

వరుసగా వికెట్లు..

ఆ తరువాత వచ్చిన టాప్ ఆర్డర్ బ్యాటర్లెవరూ కుదురుగా క్రీజ్‌లో నిల్చోలేదు. కేప్టెన్ షకీబుల్ హసన్ 13 పరుగులకే వెనుదిరిగాడు. అఫీఫ్ హొస్సేన్-3, యాసిర్ అలీ-1, మొసాద్దెక్ హొస్సేన్-6 పరుగులకే పెవిలియన్ చేరారు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు కూల్చాడు. హార్దిక్ పాండ్యా, షమీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. వికెట్ కీపర్ నూరుల్ హసన్-25, తస్కిన్ అహ్మద్-12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

అయిదు పరుగుల తేడాతో..

అయిదు పరుగుల తేడాతో..

డక్‌వర్త్ లూయిస్ విధానంలో బంగ్లాదేశ్- 16 ఓవర్లల్లో 150 పరుగులు చేయాల్సి ఉండగా.. 145 వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం. 16 ఓవర్లల్లో ఆరు వికెట్లను కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. ఈ విజయంతో భారత్.. టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్స్‌కు మరింత చేరువైంది. ఇంచ్ దూరంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే- మొత్తం ఎనిమిది పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. తన తరువాతి మ్యాచ్‌లో జింబాబ్వేను ఢీ కొట్టబోతోంది రోహిత్ సేన.

టీమిండియాకు సురేష్ రైనా వార్నింగ్..

టీమిండియాకు సురేష్ రైనా వార్నింగ్..

ఈ విజయం పట్ల టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా స్పందించాడు. ఈ మ్యాచ్‌ జట్టుకు ఓ వేక్ అప్ కాల్ వంటిదని వ్యాఖ్యానించాడు. తొలి ఏడు ఓవర్లల్లో బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారని, ఇది మంచి పరిణామం కాదని పేర్కొన్నాడు. నాకౌట్ దశలో భారత్ ఆటతీరు మరింత మెరుగు పడాల్సి ఉంటుందని తేల్చి చెప్పాడు. ఈ గేమ్‌లో బంగ్లాదేశ్ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిందని, వర్షం అడ్డుపడకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు.

బౌలింగ్ అటాక్..

బౌలింగ్ అటాక్..

తొలి ఏడు ఓవర్లలో భారత బౌలింగ్ అటాక్‌ను బంగ్లాదేశ్ బ్యాటర్లు చిత్తు చేశారని, తాము గెలిచినప్పటికీ.. బంగ్లాదేశ్ పోరాడిన తీరు స్ఫూర్తిదాయకమని, ఈ విషయాన్ని రోహిత్ శర్మ కూడా అంగీకరించాడని గుర్తు చేశాడు. నాకౌట్ దశలో ఇలాంటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించడం అసాధ్యమని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్ వనరులను మరింత బలోపేతం చేసుకోవాలని, లోపాలను సరిచేసుకోక తప్పదనీ సూచించాడు.

బ్యాటింగ్ ఓకే..

బ్యాటింగ్ ఓకే..

టాప్-5 టీమిండియా బ్యాటర్లు రాణిస్తోన్నారని, కేఎల్ రాహుల్ ఎట్టకేలకు గాడిన పడటం జట్టుకు శుభ సూచకమని సురేష్ రైనా వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలవాలంటే- రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇదే ఫామ్‌ను కొనసాగించాల్సి ఉంటుందని, బలమైన జట్లను ఢీ కొట్టాలంటే జట్టు మొత్తం సమష్టిగా రాణించాల్సి ఉంటుందని సురేష్ రైనా వివరించాడు.

Story first published: Wednesday, November 2, 2022, 20:18 [IST]
Other articles published on Nov 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+