Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: బుమ్రా దెబ్బకు బిత్తరపోయిన ముష్ఫికర్.. క్లీన్‌బౌల్డ్ (Video)

కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైంది. వరుణుడు ప్రతాపం చూపించడంతో తొలి రోజు 35 ఓవర్లు పాటే ఆట కొనసాగిన విషయం తెలిసిందే. రెండో రోజు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండా రద్దు అయ్యింది. ఆదివారం వర్షం కురవనప్పటికీ తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఆటను కొనసాగించలేకపోయారు.

వాన జాడ లేకపోవడం, సూర్యుడు ప్రకాశవంతంగా ఉండటంతో సోమవారం ఆట తిరిగి మొదలైంది. అయితే ఆట మొదలైన కాసేపటికే టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో వికెట్ సాధించాడు. ముష్ఫికర్ రహీమ్ (11; 32 బంతుల్లో, 2 ఫోర్లు)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన ముష్ఫికర్ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. బంతిని ఆడకుండా వదిలేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

IND vs BAN Bumrah s Magic Seals Mushfiqur s Dismissal with Stunning Nip-Backer

అయితే ఈ వికెట్‌లో బుమ్రా తన మ్యాజిక్ చూపించాడు. అంతకుముందు వేసిన బంతి రెండు సెంటిమీర్లు మాత్రమే డీవేయేటెడ్ అయ్యింది. కానీ అదే స్థానంలో వేసిన వికెట్ తీసిన బంతి.. ఏకంగా 6 సెంటిమీటర్లు డీవేయెటెడ్ అయ్యింది. ముష్ఫికర్ బంతిని అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బుమ్రా మ్యాజిక్ ప్రధాన కారణం. ఫలితంగా బేల్స్ ఎగిరిపడ్డాయి.

అనంతరం ఆలస్యంగా బంతిని అందుకున్న సిరాజ్.. లిటన్‌ దాస్ (13; 30 బంతుల్లో, 30 బంతుల్లో)ను బోల్తాకొట్టించాడు. రోహిత్ శర్మ అద్భుతంగా ఒంటిచేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు. ప్రస్తుతం 50 ఓవర్లకు బంగ్లాదేశ్ అయిదు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. క్రీజులో మోమినుల్ హక్ (62), షకిబ్ అల్ హసన్ ఉణ్నారు.

కాగా, ఇవాళ 98 ఓవర్ల పాటు ఆట కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో సెషన్ల టైమింగ్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి 11.45 వరకు తొలి సెషన్ జరగనుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 12.25 నుంచి 2.40 వరకు, ఆఖరి సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

Story first published: Monday, September 30, 2024, 10:55 [IST]
Other articles published on Sep 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+