Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: నాలుగో రోజు ‘నయా భారత్’.. రికార్డులే రికార్డులు!

టెస్టు క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయేలా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇవాళ ఆట కొనసాగింది. డ్రాగా ముగించికుండా విజయంతో టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఆడింది. ఈ క్రమంలో రికార్డులు బద్దలయ్యాయి. టెస్టు క్రికెట్‌లో నయా చరిత్ర నమోదైంది. బ్యాటర్లు విధ్వంసంకర బ్యాటింగ్, బౌలర్లు వ్యూహాత్మక బౌలింగ్‌తో సోమవారం అభిమానులకు నయా భారత్ సాక్ష్యాత్కారమైంది.

నాలుగో రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లకు 26 పరుగులు చేసింది. క్రీజులో మోమినుల్ హక్, షాద్మాన్ ఇస్లామ్ (7) ఉన్నారు. బంగ్లా ఇంకా 26 పరుగుల వెనుకంజలో ఉంది. మిగిలిన రేపటి ఆటలో భారత్ ఒక్క సెషన్ బ్యాటింగ్ చేసినా విజయం దాదాపు ఖాయమైనట్లే. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 107/3తో ఇవాళ ఆట ఆరంభించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌‌లో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (107 నాటౌట్; 194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ శతకంతో సత్తాచాటాడు.

IND vs BAN Box Office Test Cricket 437 Runs 18 Wickets in Action-Packed Day Sets Up Dramatic Day 5

కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (31; 57 బంతుల్లో, 6 ఫోర్లు) రెండో టాప్ స్కోరర్. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లతో చెలరేగాడు. మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. టీమిండియా 34.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిబంగ్లాదేశ్ కంటే 52 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

ఈ క్రమంలో టెస్టుల్లో వేగంగా 50, 100, 150, 200, 250 స్కోర్లు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. భారత్ 18 బంతుల్లో 50, 61 బంతుల్లో 100, 112 బంతుల్లో 150, 148 బంతుల్లో 200, 183 బంతుల్లో 250 పరుగుల మార్క్‌ను అందుకుంది. భారత బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ (72; 51 బంతుల్లో, 12 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (68; 43 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించారు.

విరాట్ కోహ్లి (47; 35 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), శుభ్‌మన్ గిల్ (39; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), రోహిత్ శర్మ (23; 11 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) కీలక పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహది హసన్ మిరాజ్, షకిబ్ అల్ హసన్ చెరో నాలుగు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్ ప్రారంభంలో ముగ్గురు స్లిప్స్‌తో తొలుత ఫీల్డింగ్ సెటప్ చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్.. కొన్ని క్షణాల్లోనే సర్కిల్‌లో ముగ్గురు ఫీల్డర్లు ఉండేలా మార్చాడు. ఆఖరి వరకు అదే ఫీల్డింగ్‌ను సెటప్ చేశాడు. భారత్ విధ్వంసకర బ్యాటింగ్‌ వర్ణించడానికి ఇది చక్కని ఉదాహరణ.

బాదడమే లక్ష్యంగా మన బ్యాటర్లు బరిలోకి దిగి బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు. జైస్వాల్ 31 బంతుల్లో, కేఎల్ రాహుల్ 33 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే రాహుల్ ఔటైన మూడు బంతులకే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్‌ను పెవిలియన్‌కు చేర్చడానికి భారత్ త్వరగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

దానికి తగ్గట్లుగానే 11 ఓవర్లలోనే బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ తన మ్యాజిక్‌తో వికెట్లు సాధించాడు. ఇక ఇవాళ ఆటలో భారత్ అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసం చేసింది. వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్లు మాత్రే ఆట కొనసాగిన విషయం తెలసిందే. రెండో రోజు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండా రద్దయింది.

Story first published: Monday, September 30, 2024, 18:22 [IST]
Other articles published on Sep 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+