ధావన్ ఔట్: మళ్లీ నాగిని డ్యాన్స్ చేసిన నజ్ముల్, వీడియో వైరల్


హైదరాబాద్: ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసినప్పుడు లేదా మ్యాచ్‌లో విజయం సాధించిన సమయంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆనందం పట్టలేక నాగిని డ్యాన్స్ చేస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరీస్‌లో శ్రీలంకపై విజయానంతరం ఆ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థుల్ని వెక్కిరించేలా నాగిని డ్యాన్స్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఆ సిరీస్ ఫైనల్లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయాక కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోని లంక, భారత్ అభిమానులు కలిసి నాగిని నృత్యం చేస్తూ బంగ్లా ఆటగాళ్లను కవ్వించే ప్రయత్నం చేశారు. అప్పట్నుంచి వాళ్లు సంయమనం పాటిస్తున్నారు. అయితే, తాజాగా మరోసారి బంగ్లాదేశ్ ఆటగాళ్లు నాగిని డ్యాన్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నజ్ముల్ ఇస్లామ్ నాగిని డ్యాన్స్
శుక్రవారం ఆసియాకప్ ఫైనల్లో భారత ఓపెనర్ ధావన్ క్యాచ్‌ను సౌమ్య సర్కార్ అందుకున్న అనంతరం బౌలర్ నజ్ముల్ ఇస్లామ్ నాగిని డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్ టైటిల్.

48.3 ఓవర్లలో 222 పరుగులు చేసిన బంగ్లాదేశ్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 121) సెంచరీ సాధించగా సౌమ్య సర్కార్ (33), మెహదీ హసన్ (32) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్‌కు మూడు, కేదార్ జాదవ్‌కు రెండు వికెట్లు దక్కగా బంగ్లా ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించిన భారత్
ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. భారత విజయానికి 18 బంతుల్లో 13 పరుగులు చేయాలి. మామూలుగా అయితే అనుభవజ్ఞులైన భారత్‌కు ఇది పెద్ద లక్ష్యం కాదు. కానీ బంగ్లా బౌలర్లు పోరాట స్ఫూర్తిని చూపెడుతూ ఆరు బంతుల తేడాలో జడేజా, భువనేశ్వర్‌ను ఔట్ చేశారు. దీంతో విజయ సమీకరణం 11 బంతుల్లో 9గా మారింది.

చివర్లో అందరిలోనూ ఒకటే ఉత్కంఠ
గాయంతో జాదవ్, కుల్దీప్ క్రీజులోకి వచ్చారు. వీరిద్దరు 3 సింగిల్స్ తీయడంతో చివరి ఓవర్‌లో 6 పరుగులు చేయాల్సిన స్థితి నెలకొంది. మహ్మదుల్లా బౌలింగ్‌కు దిగాడు.. తొలి మూడు బంతులకు 4 పరుగులు వచ్చాయి. గెలవాలంటే మరో రెండు పరుగులు అవసరం... నాలుగో బంతికి పరుగు రాలేదు. 2 బంతుల్లో 2 పరుగులు.. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ..

శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు
కానీ ఐదో బంతికి కుల్దీప్ సింగిల్ తీయగా, తర్వాతి బంతిని జాదవ్ లెగ్‌సైడ్ వైపు మళ్లించడంతో చిరస్మరణీయ విజయం భారత్ సొంతమైంది. భారత్ తరఫున ఒక్క బ్యాట్స్‌మన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. రోహిత్ శర్మ మరో (48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్‌కు దక్కగా.. శిఖర్ ధవన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications