Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: అశ్విన్ మాస్టర్ మైండ్.. బిత్తరపోయిన బంగ్లాదేశ్ (Video)

చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు‌లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటుతో బంగ్లాకు తన తడాఖా చూపించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో బంతితో చెలరేగుతున్నాడు. తన మాస్టర్ మైండ్‌తో బంగ్లా బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చుతున్నాడు.

బ్యాటర్ల ఊహకు అందని బంతులు సంధిస్తూ శనివారం ఆట ఆఖరి సెషన్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ మ్యాజిక్‌కు రోహిత్ శర్మ టాప్ ఫీల్డింగ్ సెటప్, ఫీల్డర్ల డైవింగ్ క్యాచ్‌లు జతకావడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు నిరాశగా మైదానాన్ని వీడుతున్నారు. కుదురుకున్న ఓపెనర్ షాదాన్ ఇస్లామ్ (35)ను అశ్విన్ తెలివిగా బోల్తా కొట్టించాడు. స్ట్రైట్ డెలివరీ వేస్తూ షాదాన్ ఫ్లిక్ చేసేలా చేశాడు. ఆ తర్వాత మిడ్‌వికెట్‌లో ఉన్న గిల్ గొప్పగా క్యాచ్ పట్టాడు.

IND vs BAN Ashwin s Masterclass Leaves Bangladesh Batsmen Struggling

ఇక మోమినుల్ హక్ (13)ను అశ్విన్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. మోమినుల్ డిఫెన్స్‌ను ఛేదించుకుంటూ బంతిని వికెట్లకు సంధించాడు. ఈ బంతిని చూసి మైదానంలో ఉన్న విరాట్ కోహ్లి ఫిదా అయిపోయాడు. టెస్టుల్లో మోమినుల్‌ను యాష్ ఔట్ చెయ్యడం ఇది నాలుగోసారి. ఆ తర్వాత సిక్సర్ బాది ఊపు మీదున్న ముష్ఫికర్ రహీమ్ (13)ను కూడా అశ్విన్ పెవిలియన్‌కు చేర్చాడు. కేఎల్ రాహుల్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో ముష్ఫికర్‌ను ఔట్ చేయడం ఇది అయిదో సారి.

కాగా, మూడో రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 158 పరుగులు చేసింది. విజయానికి బంగ్లాదేశ్ 357 పరుగులు, భారత్ 6 వికెట్ల దూరంలో ఉంది. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (51 బ్యాటింగ్; 60 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 81/3తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (119 నాటౌట్; 176 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్ పంత్ (109; 128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో కదం తొక్కారు.

బంగ్లా బౌలర్లలో మెహది హసన్ మిరాజ్ రెండు వికెట్లు, తస్కిన్, నహిద్ తలో వికెట్ తీశారు. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులు భారీ స్కోరు చేసింది. రవిచంద్రన్ అశ్విన్‌ (113), రవీంద్ర జడేజా (86) సత్తాచాటారు. హసన్‌ మహ్మద్‌ (5/83) అయిదు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. షకిబ్ అల్ హసన్ (32) టాప్ స్కోరర్. జస్‌ప్రీత్‌ బుమ్రా (4/50) నాలుగు వికెట్లు తీశాడు.

Story first published: Saturday, September 21, 2024, 18:05 [IST]
Other articles published on Sep 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+