IND vs BAN: చరిత్ర సృష్టించిన అశ్విన్..కుంబ్లే ఆల్‌లైమ్ రికార్డు బ్రేక్
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (27; 67 బంతుల్లో, 4 ఫోర్లు)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఈ ఘనత అందుకున్నాడు.
అంపైర్ ఔట్ ఇవ్వడంతో బంగ్లా కెప్టెన్ షాంటో రివ్యూకి వెళ్లాడు. సమీక్షలో కూడా ఎల్బీడబ్ల్యూగా ఫలితం తేలింది. వికెట్ల ముందు షాంటో దొరికిపోయినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అయితే ప్యాడ్‌కు బంతి తగలకుండా ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్నా షాంటో ఔటయ్యేవాడు. ఎలా అంటే.. ప్యాడ్లకు తాకిన బంతిని సెకండ్ స్లిప్‌లో ఉన్న గిల్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. మొత్తంగా బంగ్లాదేశ్ రివ్యూని కోల్పోయింది.

ఈ క్రమంలో ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. కాగా, ఓవరాల్‌గా ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ముత్తయ్య మురళీధరన్. ఆసియాలో ఈ లంక దిగ్గజ స్పిన్నర్ 612 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 420, కుంబ్లే 419 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో రంగన హెరత్ (354), హర్భజన్ సింగ్ (300) ఉన్నారు.
కాగా, టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. అయితే వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. వర్షం పడే సూచనలు ఉండటంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఇవాళ తడి ఔట్ ఫీల్డ్, వెలుతురులేమి కారణాలతో ఆటకు అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం ముష్ఫికర్ రహీమ్ (6), మోమినుల్ హక్ (40) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.
Pad first, finger raised ☝
— JioCinema (@JioCinema) September 27, 2024
Number 3 for #TeamIndia, courtesy R.Ashwin 🌪️#INDvBAN #JioCinemaSports #IDFCFirstBankTestSeries pic.twitter.com/LqkXW7HUmX
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications