Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. వరల్డ్ రికార్డ్!

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటుతో తడబడినా, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా సత్తాచాటుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (90 బ్యాటింగ్; 193 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (62 బ్యాటింగ్; 153 బంతుల్లో, 4 ఫోర్లు).. ఆసీస్ బౌలర్లను నిస్సహాయులుగా చేస్తూ స్కోరుబోర్డును నడిపించారు.

1
60520

ఇవాళ ఆటలో రెండు సిక్సర్లు బాదిన యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కలమ్ సరసన నిలిచాడు. 2014లో మెక్‌కలమ్ 33 సిక్సర్లు సాధించగా, ఈ ఏడాది అదే ఘనతను జైస్వాల్ అందుకున్నాడు. ఈ జాబితాలో మెక్‌కలమ్, జైస్వాల్ తర్వాతి స్థానాల్లో బెన్ స్టోక్స్ (26 సిక్సర్లు-2022), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (22 సిక్సర్లు- 2005), వీరేంద్ర సెహ్వాగ్ (22 సిక్సర్లు- 2008) ఉన్నారు.

IND vs AUS Yashasvi Jaiswal Equals Brendon McCullum s Record for Most Sixes in a Calendar Year in Tests


కాగా, ఓవర్‌నైట్ స్కోరు 67/7తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 51.2 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. జస్‌ప్రీత్ బుమ్రా (5/30) అయిదు వికెట్లతో విజృంభించాడు. హర్షిత్ రాణా (3/48) మూడు, మహ్మద్ సిరాజ్ (2/20) రెండు వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ (26; 112 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్.

స్టార్క్ మినహా అలెక్స్ కేరీ (21; 31 బంతుల్లో, 3 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (11; 13 బంతుల్లో, 2 ఫోర్లు), మెక్‌స్వీని (10; 13 బంతుల్లో, 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 46 పరుగలు ఆధిక్యం లభించింది. హేజిల్‌వుడ్ (7 నాటౌట్; 31 బంతుల్లో, 1 ఫోర్)తో కలిసి స్టార్క్ 25 పరుగలు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆఖరి వికెట్‌కు నమోదైన ఈ భాగస్వామ్యమే అత్యుత్తమం.

అంతకుముంటు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (41; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రిషభ్ పంత్ (37; 78 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), కేఎల్ రాహుల్ (26; 74 బంతుల్లో, 3 ఫోర్లు) కీలక పరుగులు చేశారు. జోస్ హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు.

Story first published: Saturday, November 23, 2024, 15:36 [IST]
Other articles published on Nov 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+