Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేప్టెన్సీపై మనసు విప్పిన రోహిత్ శర్మ - 15 ఏళ్ల తరువాత..!!

IND vs AUS Warm up: after 15 years I am captaining my country at a T20 World Cup

మెల్‌బోర్న్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వాన్ని వహిస్తోండటం రోహిత్ శర్మకు ఇదే తొలిసారి. జట్టు సారథిగా విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ పగ్గాలను అందుకున్న తరువాత టీమిండియా పలు ద్వైపాక్షిక సిరీస్‌లల్లో జయకేతనాన్ని ఎగురవేసింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి జట్లపై సిరీస్‌లను అవలీలగా గెలుచుకుంది. దాదాపుగా అన్ని ఫార్మట్లలోనూ టాప్‌గా నిలిచింది టీమ్.

ఆసియా కప్..

ఆసియా కప్..

అంతా బాగుందనుకుంటోన్న సమయంలో రోహిత్ శర్మ దూకుడు ఆసియా కప్ 2022 బ్రేక్ వేసింది. ప్రతిష్ఠాత్మక ఈ టోర్నమెంట్‌లో భారత్ తొలిదశను దాటలేకపోయిన విషయం తెలిసిందే. సూపర్ 4కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. పాకిస్తాన్, శ్రీలంక వంటి జట్ల చేతిలో పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. రోహిత్ శర్మ జైత్రయాత్రలో ఆసియా కప్ ఓటమి అనేది ఓ పంటి కింద రాయిలా తయారైంది. రన్నరప్‌గా కూడా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

ఇప్పుడు టీ20 ప్రపంచకప్..

ఇప్పుడు టీ20 ప్రపంచకప్..

ఆసియా కప్ ముగిసిన సరిగ్గా రెండు నెలల తరువాత ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ సారథ్యంలో ఆడుతోంది టీమిండియా. కేప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే తొలి టీ20 ప్రపంచకప్. ఇదివరకు ప్లేయర్‌గా మాత్రమే తన పాత్రను నిర్వర్తించాడు హిట్ మ్యాన్. ఇప్పుడు జట్టు సారథిగా ఆవిర్భవించాడు. అతని నాయకత్వంలో టీమిండియా ఈ ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022లో ఏ స్థాయిలో రాణిస్తుందనే దానిమీదే అందరి దృష్టీ నిలిచింది.

ధోనీ కేప్టెన్సీలో..

ధోనీ కేప్టెన్సీలో..

2007లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. టీ20 ఫార్మట్‌లో ప్రపంచకప్ టోర్నమెంట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ టోర్నమెంట్‌లో భారత్ విజేతగా అవతరించింది. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తరువాత మళ్లీ ఆ కప్‌ను ముద్దాడలేదు భారత్. 2014లో బంగ్లాదేశ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్స్ వరకు వెళ్లగలిగిందంతే. ఇది ఎనిమిదో టోర్నమెంట్. ఈ సారి ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది.

కేప్టెన్సీపై..

కేప్టెన్సీపై..

టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు సారథ్యాన్ని వహిస్తోండటం పట్ల రోహిత్ శర్మ స్పందించాడు. సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు. ప్రపంచకప్‌లో ఆడుతోన్న జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పాడు. 15 సంవత్సరాల్లో ఇదే తొలిసారిగా అభివర్ణించాడు. భారత్‌ను విజేతగా నిలబెట్టడంపైనే దృష్టి పెట్టానని, దీనికి అవసరమైన ప్లాన్స్ తన వద్ద ఉన్నాయని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌పై ఈ నెల 23వ తేదీన జరిగే మ్యాచ్‌కు ముందు వాటిని వివరిస్తానని చెప్పాడు.

Story first published: Monday, October 17, 2022, 11:04 [IST]
Other articles published on Oct 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+