IND vs AUS: అయ్యో పాపం.. కోహ్లి సిక్సర్‌కు సెక్యూరిటి తల పగిలింది! (Video)
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. మూడో రోజు ఆటలో టీ విరామానికి టీమిండియా అయిదు వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది. ఆసీస్ కంటే 405 పరుగలు భారీ ఆధిక్యంలో నిలిచింది. విరాట్ కోహ్లి (40 బ్యాటింగ్), వాషింగ్టన్ సుందర్ (14 బ్యాటింగ్) క్రీజులో నిలిచారు.
తొలి ఇన్నింగ్స్‌లో 12 బంతుల్లో అయిదు పరుగులకే వెనుదిరిగిన కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో ముచ్చటైన షాట్లతో బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అర్ధశతకానికి చేరువయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అప్పర్ కట్‌తో కోహ్లి స్టైలిష్ సిక్సర్ సాధించాడు. అయితే సరిగ్గా బౌండరీ రోప్ మీద పడిన బంతి అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి బలంగా తాకింది.

వెంటనే సిక్సర్‌ను పట్టించుకోకుండా సెక్యూరిటీ గార్డ్‌కు ఏమైందని విరాట్ కోహ్లి కంగారు పడ్డాడు. మరోవైపు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ గార్డ్ దగ్గరకు వెళ్లి గాయాన్ని పరిశీలించాడు. ఆస్ట్రేలియా ఫిజియో కూడా అతని వద్దకు చేరుకుని చికిత్స అందించాడు. దీంతో కాసేపు ఆట నిలిచిపోయింది. అయితే తాను బాగానే ఉన్నట్లుగా సెక్యూరిటీ గార్డ్ సింబాలిక్‌గా చెప్పడంతో స్టేడియంలో ప్రేక్షకులంతా కేరింతలు కొట్టారు.
కాగా, 172/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట ఆరంభించిన యశస్వీ జైస్వాల్ (161; 297 బంతుల్లో, 15 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (77; 176 బంతుల్లో, 5 ఫోర్లు) సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. అయితే స్కోరుబోర్డు 200 దాటిన తర్వాత రాహుల్ వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దేవదత్ పడిక్కల్ (25; 71 బంతుల్లో, 2 ఫోర్లు)తో కలిసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. రిషభ్ పంత్ (1), ధ్రువ్ జురెల్ (1) నిరాశపరిచారు.
📂 Virat Kohli's Swashbuckling six .MP4
— Star Sports (@StarSportsIndia) November 24, 2024
📺 #AUSvINDOnStar 👉 1st Test, Day 3, LIVE NOW! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/w0KmBbFznu
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications