Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: కోహ్లిని ఊరిస్తున్న సచిన్ ఆల్‌టైమ్ రికార్డ్స్!

సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు చేరాలంటే రోహిత్ సేన‌కు ఈ సిరీస్ అత్యంత కీలకం.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్‌కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్‌తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి పలు ఆల్‌టైమ్ రికార్డులపై కన్నేశాడు.

IND vs AUS Virat Kohli Targets Sachin Tendulkar s Rare Milestones in Border-Gavaskar Trophy

కోహ్లి మరో 458 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాలో టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల చేసిన భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ప్రస్తుతం ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఆస్ట్రేలియాలో టెస్టులో సచిన్‌ 20 టెస్టుల్లో 53.20 సగటుతో 1809 పరుగులు సాధించాడు. మరోవైపు కోహ్లి 13 టెస్టుల్లో 54.08 సగటుతో 1352 పరుగులు సాధించాడు.

అలాగే కోహ్లి మరో సెంచరీ సాధిస్తే కంగారూల గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన భారత ప్లేయర్‌గా కోహ్లి రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్‌ టెండుల్కర్‌, కోహ్లి పేరిట ఉమ్మడిగా ఉంది. ఇద్దరు ఆరు సెంచరీలు సాధించారు. కోహ్లి మరో సెంచరీ చేస్తే సచిన్‌ను అధిగమిస్తాడు. అయితే గతంలో భారత ఇన్నింగ్స్‌కు ఇరుసుగా మారి పరుగుల ప్రవాహం పారించే విరాట్ కోహ్లి వీరత్వం ఇటీవల కనుమరుగైంది.

ఎడమచేతి వాటం స్పిన్నర్ల అంటే వణికిపోతున్నాడు. స్పిన్‌లో వికెట్ సమర్పించుకోవడం కోసం పోటీపడుతున్నాడు. 2020 నుంచి స్వదేశంలో స్పిన్నర్ల బౌలింగ్‌లో 39 ఇన్నింగ్స్‌ల్ కోహ్లి ఏకంగా 27 సార్లు ఔటయ్యాడు. అంతేగాక కోహ్లి ఫుట్‌వర్క్ పేలవంగా మారిందని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. న్యూజిలాండ్ సిరీస్‌లో కోహ్లి 15.50 సగటుతో 93 పరుగులు చేశాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సాధించిన 70 పరుగుల మినహాయిస్తే కోహ్లి సగటు అత్యంత దారుణంగా ఉంటుంది.

Story first published: Sunday, November 17, 2024, 21:45 [IST]
Other articles published on Nov 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+